పెయింటర్ గా స్టార్ క్రికెటర్, హెన్రీ ఒలాంగా కష్టాలు

క్రికెటర్ గా జాతీయ జట్టుకు ఆడగానే చాలా మంది లైఫ్ మారిపోతుంది... అప్పటి వరకూ కష్టాలు పడుతూ ఈ స్థాయికి చేరుకున్న వారికి ఒక్కసారిగా డబ్బు, పేరుతో పాటు లగ్జరీ లైఫ్ వచ్చేస్తుంది... కానీ ఇది కొన్ని దేశాల్లో మాత్రమే... ఒకటి రెండు క్రికెట్ దేశాల్లో మాత్రం లగ్జరీ లైఫ్ పక్కన పెడితే రోజువారీ కూలీకీ ఇచ్చే మొత్తమే వస్తుంటుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 12, 2024 | 07:25 PMLast Updated on: Dec 12, 2024 | 7:25 PM

Star Cricketer Henry Olangas Struggles As A Painter

క్రికెటర్ గా జాతీయ జట్టుకు ఆడగానే చాలా మంది లైఫ్ మారిపోతుంది… అప్పటి వరకూ కష్టాలు పడుతూ ఈ స్థాయికి చేరుకున్న వారికి ఒక్కసారిగా డబ్బు, పేరుతో పాటు లగ్జరీ లైఫ్ వచ్చేస్తుంది… కానీ ఇది కొన్ని దేశాల్లో మాత్రమే… ఒకటి రెండు క్రికెట్ దేశాల్లో మాత్రం లగ్జరీ లైఫ్ పక్కన పెడితే రోజువారీ కూలీకీ ఇచ్చే మొత్తమే వస్తుంటుంది. ఈ జాబితాలో జింబాబ్వేను ముందుగా చెప్పుకోవచ్చు. ఇక రిటైర్మెంట్ తర్వాత జింబాబ్వే మాజీలు ఉద్యోగాలు వెతుక్కోవాల్సిందే.. కొందరు కామెంటేటర్లుగా సెటిల్ అయినా మరికొందరు మాత్రం అత్యంత సాధారణ పనులు చేస్తూ జీవితాలను నెట్టుకొస్తున్నారు. తాజాగా ఒకప్పటి జింబాబ్వే స్టార్ క్రికెటర్ హెన్రీ ఒలాంగా పెయింటింగ్ వేస్తూ బతుకీడుస్తున్నాడు. ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ ను ఔట్ చేశానని రెచ్చిపోయి సెలబ్రేట్ చేసుకున్న ఈ బౌలర్ ను తర్వాతి మ్యాచ్ లోనే మాస్టర్ చితకబాదాడు. అలా ఫ్యాన్స్ కు గుర్తుండిపోయిన ఈ పేస్ బౌలర్.. ఇప్పుడు ఆస్ట్రేలియాలో పొట్టపోసుకోవడం కోసం పెయింటింగ్స్ వేస్తున్నాడు.

2003 వరల్డ్ కప్ సందర్భంగా తన దేశంలో నియంత పాలన చేస్తున్న రాబర్ట్ ముగాబేకు వ్యతిరేకంగా నల్ల బ్యాండు ధరించిన ప్లేయర్ అతడు. ఆ తర్వాత పదేళ్ల పాటు ఇంగ్లండ్ లో గడిపాడు. ఆ తర్వాత 2015లో ఆస్ట్రేలియాకు మకాం మార్చాడు. అప్పటి నుంచి పెయింటింగ్ వేస్తూ జీవిస్తున్నాడు. ఈ మధ్యే ఇండియా, ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ లో జరిగిన రెండో టెస్టు సందర్భంగా గ్రౌండ్ లో పెయింటింగ్ వేస్తూ కనిపించాడు. అక్కడి లైవ్ పెయింటింగ్ వేస్తే అతనికి గంటకు కొంత మొత్తం ఇస్తారు. దానితోనే అతడు గడుపుతున్నాడు. ఈ సందర్భంగా ఒలాంగా 1998లో షార్జాలో సచిన్ తన బౌలింగ్ ను చితకబాదడం గురించి గుర్తు చేసుకున్నాడు.

గత కొన్నేళ్లుగా ఇండియన్ క్రికెట్ చాలా మారిపోయిందని చెప్పాడు. ప్రస్తుతం తాను బూమ్రా, సిరాజ్ లకు మంచి అభిమానినని చెప్పాడు. బుమ్రా ప్రపంచంలోనే బెస్ట్ బౌలర్ గా కితాబిచ్చాడు. అతని ప్రత్యేకమైన యాక్షన్, హై రిలీజ్ అద్భుతమన్నాడు. బూమ్రా ఫామ్ లో ఉంటే ఎంత తక్కువ స్కోర్లనైనా భారత్ కాపాడుకోగలదంటూ అంటూ అంచనా వేశాడు. తాను ఆడే రోజుల్లో భారత జట్టులో ఎక్కువగా స్పిన్నర్లు ఉండేవారని, ఇప్పుడు గంటకు 140 కి.మీ. వేగంతో బౌలింగ్ చేసే వాళ్లు ఎంతో మంది ఉన్నారన్నాడు.