Stock Grow Report: ఒక్క గుడ్డు ధర రూ. 46 ఎక్కడో తెలుసా..?
ప్రపంచంలో అత్యంత అధికంగా గుడ్ల ధరలు ఉన్న దేశం స్విట్జర్లాండ్ అయితే అత్యంత తక్కువ ధర ఉన్న దేశం డెన్మార్క్ గా గుర్తించబడింది.

Stock Grow is a company that has analyzed the prices of eggs in different countries of the world
మనదేశంలోనే కాదు ప్రపంచ దేశాలన్నీ పౌష్టికాహార లోపంతో ఇబ్బంది పడుతున్నాయి. దీనికి కారణం సరైన తిండి లేకనో.. తినేందుకు సరిపడా డబ్బులు లేకో.. ఈ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అయితే చాలా మంది ఈ యాంత్రిక ప్రపంచంలో సరైన తిండి అందుబాటులో ఉండి, చేతి నిండా డబ్బులు ఉన్నప్పటికీ సమయం లేక తినలేక పోతున్నారు. అయితే ఈ కోవలోకి అమెరికా, న్యూజిలాండ్ వంటి దేశాలు కూడా ఉన్నాయి.
స్టాక్ గ్రో సంస్థ ఏం చెబుతోంది..
ఈ పౌష్ఠికాహారాన్ని ప్రత్యేకంగా తినాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. పైగా అన్ని విటమిన్లు, ప్రోటీన్లు సక్రమంగా ఉన్నాయో లేవో చూసుకునే మీటర్ మనకు దగ్గర్లో అందుబాటులో ఉండదు. అందుకే ప్రతి ఒక్కరూ గుడ్డును తినేందుకు ఇష్టపడతారు. గుడ్డులో చాలా ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. పైగా తక్కువ ధరకు అందుబాటులో ఉంటాయి. వీటిని రకరకాలుగా వండుకుని, ఉడికించుకుని తినేందుకు ఆసక్తి చూపుతారు. తాజాగా గుడ్డు ధరలపై ఒక సంస్థ వివిధ దేశాల్లో సర్వే నిర్వహించింది. అందులో సంచలనమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ సోషల్ ట్రెండింగ్ ప్లాట్ ఫాం అయిన స్టాక్ గ్రో వాటి ధరలను విశ్లేషించింది. ఒక్కో దేశాన్ని బట్టి ఒక్కో రకమైన ధరలు నిర్ణయించబడ్డాయి. కొన్ని దేశాల్లో చాలా చౌకగా ఉంటే.. మరి కొన్ని దేశాల్లో సామాన్యునికి అందని ద్రాక్షలా మారింది.
ప్రపంచ దేశాల్లో డజన్ గుడ్ల ధరలు ఇలా..
- స్విట్జర్లాండ్ లో రూ. 560 – ఒక్కో గుడ్డు రూ. 46
- అమెరికాలో మొదటి రకం రూ. 456 – ఒక్కో గుడ్డు రూ. 38, రెండవ రకం రూ. 359 – ఒక్కో గుడ్డు రూ. 29
- రష్యా, పాకిస్తాన్, ఇరాన్, బంగ్లాదేశ్ లో రూ. 100 – ఒక్కో గుడ్డు రూ. 8
- భారత్ లో సగటు ధర రూ. 79 – ఒక్కో గుడ్డు రూ. 6
- డెన్మార్క్ లో రూ. 50 – ఒక్కో గుడ్డు రూ. 4
ఇలా ప్రపంచ దేశాల్లో గుడ్ల విలువ చూస్తే ఉత్పత్తి తక్కువగా ఉండే దేశాల్లో వీటి డిమాండ్ పెరిగి ధరలు కూడా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మన దేశంలో గుడ్లను ఉత్పత్తి చేసే ఫౌంల్ట్రీలు అధికంగా ఉండటం వల్ల గుడ్ల ధరలు నియంత్రణలో ఉంటాయి.
T.V.SRIKAR