మొహర్రం సందర్భంగా స్టాక్ మార్కెట్ మూత పడింది. స్కూళ్ళు, ఇతర విద్యాసంస్థలు, ఆఫీసులు, బ్యాంకులు కూడా ఇవాళ మూతపడ్డాయి. BSE, NSE ల్లో ఎలాంటి ట్రేడింగ్ జరగదు. స్టాక్ మార్కెట్ మొత్తం సెలవు ఉంటుంది. ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ డైరివేటివ్ సెగ్మెంట్, ACLBని కూడా మూసేశారు. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా కూడా క్లోజో చేశారు. RBI సెలవుల జాబితాలో సిమ్లా, షిల్లాంగ్, రాంచీ, రాయ్ పూర్, పాట్నా, న్యూఢిల్లీలోని ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులకు సెలవు ప్రకటించారు. ఇవి కాకుండా దాదాపు అన్ని రాష్ట్రాల్లో మొహర్రం పండుగ సందర్భంగా సెలవు ఇచ్చారు. స్టాక్ మార్కెట్ మళ్ళీ సెలవు ఎప్పుడు? స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఆగస్టు 15న స్టాక్ మార్కెట్ మళ్ళీ హాలిడే ఉంటుంది. ఈ ఏడాదిలో స్టాక్ మార్కెట్లో మొత్తం 14 రోజుల సెలవులు ప్రకటించారు. గత శుక్రవారం నుంచి సెన్సెక్స్, నిఫ్టీలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FSIIలు) కొనుగోలు చేయడం. FSIలు కేంద్ర బడ్జెట్ ను సమర్పించే ముందు భారతీయ స్టాక్స్ ని కొంటుంటారు. షేర్ల విలువ ఎక్కువగా ఉన్నా... కొన్ని బడా కంపెనీలు క్వార్టర్ రిజల్ట్స్ మంచిగా ఉండటంతో మార్కెట్ లో ప్రోత్సాహం కనిపించింది.