Pawan Kalyan: పవన్‌పై రాయితో దాడి.. తప్పిన ప్రమాదం

ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కల్యాణ్ శనివారం గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటిస్తున్నారు. 'వారాహి యాత్ర'లో భాగంగా, పవన్ వాహనంపై ఉండగా.. గుర్తు తెలియని వ్యక్తి పవన్ కళ్యాణ్‌పై రాయి విసిరాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 14, 2024 | 07:31 PMLast Updated on: Apr 14, 2024 | 7:31 PM

Stone Pelting On Pawan Kalyan In Tenali Vaarahi Vijayabheri Yatra

Pawan Kalyan: ఏపీలో రాజకీయాలు హింసాత్మకంగా మారుతున్నాయా అనిపిస్తోంది. శుక్రవారమే జగన్‌పై రాయితో దాడి జరగగా.. అది మర్చిపోకముందే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై దాడి జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కల్యాణ్ శనివారం గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటిస్తున్నారు. ‘వారాహి యాత్ర’లో భాగంగా, పవన్ వాహనంపై ఉండగా.. గుర్తు తెలియని వ్యక్తి పవన్ కళ్యాణ్‌పై రాయి విసిరాడు.

YS JAGAN-SRI REDDY: నేను చనిపోతా.. శ్రీ రెడ్డి ఎమోషనల్ పోస్ట్‌

అయితే, అది పవన్‌కు తగలకుండా కొద్ది దూరంలో పడిపోయింది. దీంతో పవన్‌కు ప్రమాదం తప్పింది. వెంటనే అప్రమత్తమైన పవన్ భద్రతా సిబ్బంది, జనసేన కార్యకర్తలు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పవన్‌పై దుండగులు రాయి విసిరినప్పటికీ ఆయన తన యాత్ర కొనసాగించారు. ఈ ఘటన నేపథ్యంలో పవన్ భద్రతపై జనసేన శ్రేణులు ఆందోళనవ్యక్తం చేస్తున్నాయి. అయితే, అటు జగన్‌పై.. ఇటు పవన్‌పై వరుసగా రాళ్లు విసిరే ఘటనలు జరగడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. నాయకులకు ఎటువంటి హాని జరగకుండా పోలీసులు, భద్రతాసిబ్బంది వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

ఇక.. జగన్‌పై జరిగిన దాడి ఘటనకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. క్రైమ్ బ్రాంచ్, ఫోరెన్సిక్ నిపుణులు ఈ ఘటనకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించారు. ఘటన నేపథ్యంలో జగన్‌కు మరింత భద్రత కల్పించారు. ఈ ఘటనలో ఆయన ఎడమ కంటికి గాయమైంది. దీంతో వైద్యులు ఆయనకు చికిత్స అందించారు.