ధోనీ భజన ఆపండిరా, ఫ్యూచర్ కెప్టెన్ పై ఫోకస్ ఎప్పుడు ?
ఈ 8 మ్యాచులలో రెండు కన్నా ఎక్కువ మ్యాచ్‌లలో సీఎస్కే ఓడిపోతే.. ఆ జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు ముగిసినట్టే. కాబట్టి ఈ 8 మ్యాచులలో కనీసం ఏడింటిలో గెలిస్తే ప్లే ఆఫ్ రేసులో నిలుస్తుంది. అయితే చెన్నై జట్టుకు ఈ పరిస్థితి రావడానికి ఆ ఫ్రాంచైజీ తీరే కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ 8 మ్యాచులలో రెండు కన్నా ఎక్కువ మ్యాచ్‌లలో సీఎస్కే ఓడిపోతే.. ఆ జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు ముగిసినట్టే. కాబట్టి ఈ 8 మ్యాచులలో కనీసం ఏడింటిలో గెలిస్తే ప్లే ఆఫ్ రేసులో నిలుస్తుంది. అయితే చెన్నై జట్టుకు ఈ పరిస్థితి రావడానికి ఆ ఫ్రాంచైజీ తీరే కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధోనీ వారసులను సిద్ధం చేసుకోవడంలో సీఎస్కే మేనేజ్ మెంట్ అట్టర్ ఫ్లాప్ అయింది. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో 2024 సీజన్‌లో బాగానే ఆడింది చెన్నై సూపర్ కింగ్స్. నిజానికి 2024 సీజన్‌లో చెన్నైలో బాగా ఆడింది రుతురాజ్ గైక్వాడ్ మాత్రమే. అయినా ఈ సీజన్‌లో 5 మ్యాచుల్లో 4 పరాజయాలు రాగానే తిరిగి కెప్టెన్సీ లాక్కొని, ధోనీకే బాధ్యతలు అప్పగించింది. కాగా జట్టులో రుతురాజ్ స్థానంలో కెప్టెన్ గా నడిపించే ఆటగాడు ఒక్కడూ లేడా అన్నది వారికే తెలియాలి. ఎందుకంటే సరిగ్గా చూస్తే కెప్టెన్సీ ఆప్షన్స్ చాలానే ఉన్నాయి.
ఉంటే, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని టీమ్‌లో ఉన్న కుర్రాళ్లకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలి… రచిన్ రవీంద్రలో కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి. కావాలంటే అతనికి కెప్టెన్సీ ఇవ్వొచ్చు. లేదంటే శివమ్ దూబే, డివాన్ కాన్వేలను కెప్టెన్లుగా ప్రయత్నించవచ్చు. అక్షర్ పటేల్, రజత్ పటిదార్ కెప్టెన్సీ చేయగలరని ఎవ్వరైనా ఊహించారా? వీరంతా కాదనుకుంటే రవిచంద్రన్ అశ్విన్‌కి కెప్టెన్సీ చేసిన అనుభవం కూడా ఉంది. అశ్విన్ ఈజీగా మరో రెండు మూడు సీజన్లు ఆడగలడు.. వచ్చే సీజన్‌కి ఉంటాడో లేదో తెలియని ధోనీకి తిరిగి కెప్టెన్సీ ఇవ్వడం కంటే అశ్విన్‌కి ఇవ్వడంలో ఓ న్యాయం ఉంటుంది.ఆర్‌సీబీ బ్రాండ్ వాల్యూ అంతా విరాట్ కోహ్లీ చుట్టే తిరుగుతుంది. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ అంటే ధోనీ, ధోనీ అంటే చెన్నై సూపర్ కింగ్స్.
ఐపీఎల్ లో ఫస్ట్ సీజన్ నుంచి సీఎస్కేకు ధోని కెప్టెన్. 2022లో రవీంద్ర జడేజాకు టీమ్ పగ్గాలు అప్పజెప్పారు. కానీ టీమ్ ఓడుతుండటంతో ఈ కెప్టెన్సీ తన వల్ల కాదు బాబోయ్ అంటూ జడ్డూ మధ్యలోనే తప్పుకొన్నాడు. మళ్లీ ధోనీనే కెప్టెన్ అయ్యాడు. 2023లో టీమ్ ను ఛాంపియన్ గా నిలిపాడు. ఆ తర్వాతి సీజన్ లో రుతురాజ్ గైక్వాడ్ ను కొత్త కెప్టెన్ గా ఎంపిక చేశారు. ఆ సీజన్ లో టీమ్ 14 మ్యాచ్ ల్లో 7 గెలిచి, 7 ఓడింది. ప్లేఆఫ్స్ చేరలేకపోయింది. ఇప్పుడు 2025లోనూ రుతురాజ్ కెప్టెన్ గా కొనసాగాడు. కానీ అతనికి ఇంజూరీ కారణంగా మళ్లీ ధోనీనే సారథ్యం తీసుకున్నాడు. 43 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ ఎప్పుడా అని ప్రశ్నలు వస్తున్న వేళ.. ధోని మళ్లీ కెప్టెన్ అవడం ఊహించనిదే. ధోని కాకపోతే సీఎస్కేకు దిక్కే లేదా? అంటే ఇప్పుడు మాత్రం నో అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆ టీమ్ దగ్గర ప్లాన్-బి లేదు. రుతురాజ్ లేకపోతే కెప్టెన్ ఎవరు అనే ప్రశ్నకు ఆ టీమ్ ఇంకా ఆన్సర్ రెడీ చేసుకోలేదు. కానీ ధోనీ ఒక్కడిపైనే ఆధారపడితే, అతను రిటైర్ అయ్యాక టీమ్ పరిస్థితి ఏంటి.. 50 ఏళ్లు వచ్చాక కూడా ధోనీ మళ్లీ వచ్చి కెప్టెన్సీ చేస్తాడా.. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచనా విధానం ఏంటో వారికే తెలియాలి. ధోనీకి ఇదే ఆఖరి సీజన్ కావచ్చు. కెప్టెన్‌గా టైటిల్ గెలిచి, ఐపీఎల్ నుంచి తప్పుకోవాలని మాహీ అనుకుంటూ ఉండొచ్చు. అయితే అతని ఆటలో మునుపటి వాడి లేదు. రచిన్ రవీంద్ర తప్ప, టీమ్‌లో మరే ప్లేయర్ ఫామ్‌లో లేడు. ఈ టీమ్‌తో టైటిల్ గెలిస్తే నిజంగా ధోనీ చాలా రేర్ కెప్టెన్ అవుతాడు. అయితే 2022 సీజన్‌లో జరిగిందే రిపీట్ అయితే.. ఏముంది ధోనీ ఇంకో సీజన్ ఆడతాడు. ఏదేమైనా ధోనీ మీద ఉన్న క్రేజ్ చివరికి ఆ ఫ్రాంచైజీకే నష్టం చేస్తుందన్న పలువురు మాజీ క్రికెటర్ల వాదనే ఇప్పుడు నిజమయ్యేలా కనిపిస్తోంది. ఈ సీజన్ ముగిసిన తర్వాతయినా చెన్నై ఫ్రాంచైజీ యాజమాన్యం జట్టును కనీసం ఐదారేళ్ళు తమ జట్టును నడిపించే ఆటగాడికి కెప్టెన్సీ అప్పగించకుంటే ఇబ్బందులు తప్పవు.