Cyclone : మహారాష్ట్ర, గోవా, కర్ణాటక తీరంలో రాకాసి అలల అలజడి.. తుఫాన్ హెచ్చరిక..?
అట్లాంటిక్ మహాసముద్రం (Atlantic Ocean) లో రాకాసి అలలు అలజడి సృష్టిస్తున్నాయి.
అట్లాంటిక్ మహాసముద్రం (Atlantic Ocean) లో రాకాసి అలలు అలజడి సృష్టిస్తున్నాయి. దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రం (South Atlantic Ocean) లో భారత తీరం నుంచి దాదాపుగా పది వేళ కి.మీ దూరంలో ఏర్పడిన అధిక కాలపు ఉబ్బరం నెమ్మెదిగా దక్షిణ హిందూ మహాసముద్రం వైపు కదులుతు వస్తున్నట్లు భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. దీంతో ఉవ్వొత్తున భారీ అలలు భారత తీరం వైపు దూసుకొస్తున్నాయి. మహారాష్ట్ర, గోవా, కర్ణాటకతో పాటు పలు తీర ప్రాంతాలపై రాకాసి అలల ప్రభావం పడనుంది. సముద్రం తీరంలో అలలు దాదాపు 2 మీటర్ల వరకు ఎగసిపడుతున్నాయి రాకాసి అలలు.. దీంతో ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సంస్థ హెచ్చరికలతో ఇండియన్ నేవీ అధికారులు అప్రమత్తమయ్యారు. తీరం వెంట ఉన్న లోతట్టు ప్రాంతాల రక్షణకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని తెలిపారు.
ఈ ప్రాంతాలకు భారీ ముప్పు..
గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, అండమాన్, తమిళనాడు, కేరళ, లక్షద్వీప్, పశ్చిమ్ బెంగాల్, ఒడిశా, తీర ప్రాంతాలపై రాకాసి అలలు విరుచుకుపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
SSM