జగన్ కు వరుస దెబ్బలు, వీళ్ళు అందరూ గుడ్ బై…!
అధికారం కోల్పోయి నానా అవస్థలు పడుతున్న వైసీపీకి ఆ పార్టీ నేతలు వరుస షాక్ లు ఇస్తున్నారు. ఆ పార్టీ నుంచి బయటకు వెళ్లి ఇతర పార్టీలలో జాయిన్ అయ్యేందుకు సిద్దమవుతున్నారు.

అధికారం కోల్పోయి నానా అవస్థలు పడుతున్న వైసీపీకి ఆ పార్టీ నేతలు వరుస షాక్ లు ఇస్తున్నారు. ఆ పార్టీ నుంచి బయటకు వెళ్లి ఇతర పార్టీలలో జాయిన్ అయ్యేందుకు సిద్దమవుతున్నారు. కొందరు ఎంపీలు రేపు వైసీపీని వీడతారని ప్రచారం జరుగుతోంది. వైసిపి ఆవిర్భావం నుండి కీలకంగా వ్యవహరించిన రాజ్యసభ ఎంపీ కూడా పక్క చూపులు చూస్తున్నారని గుసగుసలు వినపడుతున్నాయి.
ఇప్పటికే వైసిపి రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు నిర్ణయాన్ని ప్రకటించారు. త్వరలో టీడీపీలో మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు చేరే అవకాశాలు కనపడుతున్నాయి. ఢిల్లీలో రేపు రాజ్యసభ ఛైర్మన్నుా కలిసి రాజీనామా పత్రాలిచ్చే అవకాశం ఉందని ఏపీ రాజకీయ వర్గాలు అంటున్నాయి. వైసీపీ నుంచి టీడీపీ, బీజేపీ, జనసేనలో త్వరలో భారీ చేరికలు ఉండే అవకాశం ఉంది. బీజేపీలో చేరేందుకు కొందరు వైసీపీ ఎంపీల ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఒక లోక్సభ ఎంపీ బిజెపిలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం.