China floods : చైనాలో ఆకస్మిక వరదలు.. బ్రిడ్జ్ కూలి 12 మంది మృతి..
భారత్ పొరుగు దేశం చైనాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. గత కొన్ని రోజులుగా చైనాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న షాంగ్లూ నగరంలోని ఝాషుయ్ కౌంటీలో హైవేపై ఉన్న వంతెన పాక్షికంగా కూలిపోయింది.

Sudden floods in China.. 12 people died after the bridge collapsed..
భారత్ పొరుగు దేశం చైనాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. గత కొన్ని రోజులుగా చైనాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న షాంగ్లూ నగరంలోని ఝాషుయ్ కౌంటీలో హైవేపై ఉన్న వంతెన పాక్షికంగా కూలిపోయింది. ఈ ఘటనలో 12 మంది మరణించారు. మరో 31 మంది గల్లంతయ్యారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు సంభవించడంతో వంతెన కూలిపోయిందని ప్రాధమిక దర్యాప్తులో అధికారులు గుర్తించారు. చైనా మీడియా సమాచారం ప్రకారం, రాత్రి 8:40 గంటల సమయంలో కుండపోత వర్షం, వరదల కారణంగా ఈ వంతెన కూలిపోయినట్లు తెలుస్తోంది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆదేశాలతో ఈ ఘటనలో గల్లంతైన వారికికోసం చైనా ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన.. 736 మంది రెస్కూ చేసేందుకు రంగంలోకి దిగారు. 76 వాహనాలు, 18 పడవలు, 32 డ్రోన్లు రంగం లోకి దిగాయి.
ఇప్పటివరకు గల్లంతైన వారిలో నదిలోంచి 12 మృతదేహాలను బయటకు తీయగలిగారు. ఒకరిని సూరక్షితంగా రక్షించారు. ప్రజలను రక్షించడానికి సకల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గల్లంతైన వారికోసం గాలించాలని, ప్రాణనష్టం వీలైనంతవరకు తగ్గించాలని ఆయన ఆదేశించారు. నదిలో పడిన ఐదు వాహనాలను రెస్కూ బృందాలు స్వాధీనం చేసుకున్నాయని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారలు వెల్లడించారు. మరో వైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు హన్యున్ కౌంటీలోని గ్రామంలో 40కి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయన్నారు. భారీ వరదలకు సియాచిన్ ప్రావిన్స్ జిన్హువా గ్రామంలో 30 మంది గల్లంతయ్యారు.