Suma Son: సుమ కొడుకు జక్కన్న సపోర్ట్…
తాజాగా రోషన్ కనకాల నటిస్తున్న సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను దర్శకధీరుడు రాజమౌళి సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియాజేశారు.

Suma Rajeev Kanakala's son Roshan Kanakala is about to enter the film industry
యాంకర్ సుమ-రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ వెండితెరపై అరంగేట్రం చేస్తున్నాడు. సినిమా రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. టాలీవుడ్ లో ఎంతమంది యాంకర్లు ఉన్నా యాంకర్ సుమ రేంజ్ వేరే లెవల్. టెలివజన్ షోల నుంచి సినిమా ఈవెంట్ ల వరకు ఎందులో అయినా సుమ తన వాగ్దాటితో ఆధ్యాంతం ఆకట్టుకుంటుంది. మైక్ పట్టుకుందంటే చాలు గలగలా మాట్లాడుతూ వేదికపై సందడి చేస్తూ ప్రేక్షకుల్లో జోష్ నింపుతుంది యాంకర్ సుమ. మరోవైపు రాజీవ్ కనకాల సినిమాల్లో విభిన్నమైన పాత్రలు చేసి అభిమానుల్లో ప్రత్యేకమైన గుర్తింపు పొందాడు. ఇప్పుడు రోషన్ కనకాల తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడిచేందుకు సిద్ధమయ్యాడు. ఇదివరకే చైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాలు చేసిన రోషన్ ఓ సినిమా ద్వారా హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నాడు.
తాజాగా రోషన్ కనకాల నటిస్తున్న సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను దర్శకధీరుడు రాజమౌళి సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియాజేశారు. డైరెక్టర్ రవికాంత్ పేరుపు దర్శకత్వం వహిస్తున్న బబుల్ గమ్ సినిమాలో హీరోగా రోషన్ కనకాల హీరోయిన్ గా చెరుకూరి మానస చౌదరి నటిస్తోంది. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మరియు మహేశ్వరి మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను రాజమౌళి విడుదల చేశారు.
‘బబుల్‌గమ్’ సినిమాతో ఇద్దరు కొత్తవారు వెండితెరకు పరిచయం అవుతున్నారు. వారే రోషన్ కనకాల, మానస చౌదరి . వారిద్దరూ ఈ ఫస్ట్ లుక్‌లో తళుక్కున మెరుస్తూ, తమ చార్మ్‌తో వీక్షకులని కట్టిపడేశారు. రోషన్ కనకాల గిరజాల జుట్టు, లేత గడ్డంతో పోస్టర్‌లో అందంగా కనిపిస్తున్నాడు. ట్రెండీ ఎటైర్‌లో యంగ్ చాప్.. నోటిలో బబుల్‌గమ్‌తో కనిపించారు. ఈ రొమాంటిక్ స్టోరీ గ్లింప్స్‌ను అక్టోబర్ 10న విడుదల చేయబోతున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ రొమాంటిక్ గా ఉండడంతో యూత్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఈ సినిమా ద్వారా రోషన్ కనకాల హిట్ అందుకుంటాడో చూడాలి.