క్షీణిస్తున్న సునీతా విలియమ్స్ ఆరోగ్యం
అంతరిక్షంలో ఉన్న ఆస్ట్రోనాట్స్ ఆరోగ్యం విషయంలో రోజు రోజుకూ ఆందోళన పెరిగిపోతోంది. నాసా ఆస్ట్రోనాట్ సునితా విలియమ్స్ ఆరోగ్యం క్షీణిస్తున్నట్టు తెలుస్తోంది. ఆమె బరువు తగ్గి చిక్కిపోయినట్లు ఉన్న ఓ ఫొటో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

అంతరిక్షంలో ఉన్న ఆస్ట్రోనాట్స్ ఆరోగ్యం విషయంలో రోజు రోజుకూ ఆందోళన పెరిగిపోతోంది. నాసా ఆస్ట్రోనాట్ సునితా విలియమ్స్ ఆరోగ్యం క్షీణిస్తున్నట్టు తెలుస్తోంది. ఆమె బరువు తగ్గి చిక్కిపోయినట్లు ఉన్న ఓ ఫొటో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. చాలా కాలంగా అంతరిక్షంలోనే ఉన్న కారనంగా ఆమె పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారని వైద్యులు చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే తీవ్ర ఆరోగ్యం సమస్యలు వచ్చే ప్రమాదముందని చెప్తున్నారు. ఈ ఏడాది జూన్ 6న బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సుల్లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సునీత, విల్మార్.. సాంకేతిక లోపం కారణంగా అక్కడి చిక్కుకున్నారు. దాదాపు 4 నెలల నుంచి అక్కడే ఉన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వాళ్లను భూమి మీదకు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి.