Renuka Swamy : లవర్ కోసం సూపర్‌స్టార్ ఘాతుకం.. ఇంతకీ ఎవరీ రేణుకా స్వామి!
కర్ణాటక (Karnataka) ఛాలెంజింగ్ స్టార్ హీరో దర్శన్ అరెస్ట్ కలకలం రేపుతోంది. రేణుక స్వామి (Renuka Swamy) హత్య కేసులో ఆయనను మైసూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన కన్నడ సినీ పరిశ్రమను కుదిపేసింది.

కర్ణాటక (Karnataka) ఛాలెంజింగ్ స్టార్ హీరో దర్శన్ అరెస్ట్ కలకలం రేపుతోంది. రేణుక స్వామి (Renuka Swamy) హత్య కేసులో ఆయనను మైసూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన కన్నడ సినీ పరిశ్రమను కుదిపేసింది. ఈ కేసులో హీరోపై ఆరోపణలు రావడం.. వెంటనే కేసు నమోదు చేయడం.. అన్నీ చకచకా జరిగిపోయాయ్. లవర్ కోసమే.. దర్శన్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. దర్శన్ మ్యారీడ్ లైఫ్ కొద్దిరోజులుగా వివాదాలకు కేరాఫ్‌గా ఉంది. దర్శన్‌కు విజయలక్ష్మీతో పెళ్లి అవగా.. కొద్దికాలంగా నటి పవిత్రగౌడతో అతను రిలేషన్‌షిప్‌లో ఉన్నారు.
దీంతో విజయలక్ష్మీతో దాంపత్య జీవితం సమస్యల్లో పడింది. పవిత్ర గౌడ కూతురు బర్త్ డేకు దర్శన్ హాజరుకావడంతో వారి మధ్య సంబంధం వెలుగులోకి వచ్చింది. వారిద్దరి వ్యవహారంపై కొద్దికాలంగా కన్నడ మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయ్. ఐతే ఇప్పుడు రేణుకాస్వామి అనే హత్యతో దర్శన్‌కు సంబంధం ఉందన్న వ్యవహారం.. కన్నడనాట కాక పేరుతోంది. రేణుక స్వామి దర్శన్‌కు వీరాభిమాని. ఐతే అభిమాన హీరో.. తన భార్యకు అన్యాయం చేయడంపై రేణుకస్వామి బహిరంగ వ్యాఖ్యలు చేశారు. దర్శన్, పవిత్ర తీరును తప్పుపట్టారు. పవిత్ర గౌడపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పవిత్ర గౌడను ఉద్దేశించి సోషల్‌మీడియాలో కించపరిచే పోస్టులతో పాటు ఆమెకు అసభ్యకరమైన సందేశాలను రేణుకాస్వామి పంపినట్లు తెలుస్తోంది.
దీంతో ఓ దశలో దర్శన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. పవిత్ర గౌడపై (Pavitra Gowda)అనుచిత వ్యాఖ్యలు చేసిన కొద్దిరోజులకే… రేణుక స్వామి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. రేణుకు స్వామి మృతదేహాన్ని సున్నహల్లి బ్రిడ్డి దగ్గర గుర్తించారు. ఈ ఘటనపై కామాక్షి పాల్య పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఈ హత్యతో దర్శన్‌కు సంబంధం ఉందని స్టార్ హీరోపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనను అరెస్ట్ చేశారు. దర్శన్ అరెస్ట్ ఘటన కన్నడ పరిశ్రమనే కాకుండా దక్షిణాది సినీ పరిశ్రమను కుదిపేసింది. భారీగా ఫాలోయింగ్ ఉన్న దర్శన్ ఫ్యాన్స్ ఈ వార్తను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఈ హత్య కేసులో ఇప్పటివరకూ దర్శన్‌తో పాటు 10 మంది అరెస్టయినట్లు తెలుస్తోంది.