Baba Ramdev: పతంజలి యాడ్స్.. బాబా రాందేవ్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
పతంజలి బ్రాండ్‌తో పలు ఆయుర్వేద, ఆహార ఉత్పత్తుల్ని బాబా రాందేవ్ ఆధ్వర్యంలో విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ బ్రాండ్లకు సంబంధించిన ప్రకటనల విషయంలో ప్రజల్ని తప్పుదోవపట్టిస్తోందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆరోపించింది.

Baba Ramdev: పతంజలి ఉత్పత్తుల విషయంలో యోగా గురు బాబా రాందేవ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ నోటీసుకు స్పందించక పోవడంతో తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. బాబా రాందేవ్‌తో పాటు పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణకు కూడా సమన్లు పంపించింది. ఈ మేరకు జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహ్సనుద్దీన్ అమానుల్లాతో కూడిన సుప్రీం ధర్మాసనం ఆదేశాలిచ్చింది.
Intermittent Fasting Heart Disease: ఇంటర్ మిటెంట్ ఫాస్టింగ్ డేంజర్ ! 91శాతం గుండె పోటుకు అవకాశం !!
పతంజలి బ్రాండ్‌తో పలు ఆయుర్వేద, ఆహార ఉత్పత్తుల్ని బాబా రాందేవ్ ఆధ్వర్యంలో విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ బ్రాండ్లకు సంబంధించిన ప్రకటనల విషయంలో ప్రజల్ని తప్పుదోవపట్టిస్తోందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆరోపించింది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్న పతంజలి ప్రకటనల విషయంలో చర్యలు తీసుకోవాలని కోరుతూ ఐఎంఏ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు పతంజలికి గతంలో నోటీసులిచ్చింది. డ్రగ్స్ అండ్ రెమిడీస్ చట్టంలోని సెక్షన్ 3, 4 ప్రకారం రాందేవ్, బాలకృష్ణ ఉల్లంఘనలకు పాల్పడినట్లు కోర్టు తెలిపింది. దీనికి స్పందించిన పతంజలి సంస్థ.. తప్పుడు ప్రకటనల్ని నిలిపివేస్తామని హామీ ఇచ్చింది. కానీ, ఈ మాట నిలబెట్టుకోవడంలో ఆ సంస్థ విఫలమైంది. దీనిపై మళ్లీ బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణకు గతంలో నోటీసులు జారీ చేసింది. పతంజలి ఉత్పత్తులు, ఔషధాల నాణ్యతకు సంబంధించిన ప్రకటనల విషయంలో గతంలో కోర్టుకు ఇచ్చిన ప్రాథమిక హామీని సంస్థ ఉల్లంఘించినట్లు సుప్రీం గుర్తించింది. ఈ విషయంపై గత నెలలోనే పతంజలిని సుప్రీంకోర్టు నిలదీసింది.
అయినప్పటికీ వాళ్లు స్పందించలేదు. దీంతో తాజాగా కోర్టు ధిక్కరణ నోటీసులు ఇచ్చింది. తమ ఆదేశాలను ధిక్కరించినందుకుగాను.. స్వయంగా తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఇందుకు రెండు వారాల గడువు విధించింది. కేసు విచారణను వాయిదా వేయబోమని కూడా తెలిపింది. అయితే, ఈ కేసు విచారణలో రాందేవ్ బాబాకు నోటీసులు ఇవ్వడాన్ని ఆయన తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి అభ్యంతరం వ్యక్తం చేశారు. రాందేవ్ బాబాకు నోటీసులు ఎలా ఇస్తారని కోర్టును ప్రశ్నించారు. దీనికి స్పందించిన కోర్టు.. మీరు తదుపరి విచారణకు వస్తారు కదా.. అప్పుడు చూద్దాం అంటూ వ్యాఖ్యానించింది. మరి ఈసారైనా రాందేవ్ బాబా.. కోర్టుకు హాజరవుతారా.. లేదా.. అనేది చూడాలి.