Supreme Court: వైవాహికులు కోరిన వెంటనే విడాకులు.. సుప్రీం కోర్ట్ ధర్మాసనం సంచలన తీర్పు..

వివాహాలు చేసుకున్న వారు తమ వైవాహిక జీవితంలో సఖ్యత కుదరక స్వేచ్ఛ హరింపబడితే విడాకులు కోరవచ్చు. దీనికి సంబంధించి గతంలో నిర్ణీత గడువును నిర్ణయించింది దేశ అత్యున్నత న్యాయస్ధానం. కానీ నేడు ఆ గడువుకు తెరదించుతూ సంచలన తీర్పును వెల్లడించింది. దాంపత్య జీవితంలో పొసగలేని వారికి వెంటనే విడాకులు మంజూరు చేసే విశిష్ట అధికారం సుప్రీం కోర్టుకు ఉంటుందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 1, 2023 | 01:22 PMLast Updated on: May 01, 2023 | 1:31 PM

Supreme Court Dessition For Divers

నేటి సమాజంలో విభిన్న ఆచారాలు, కట్టుబాట్లు, సంస్కృతి సంప్రాదాయాలను పాటించే వెసులు బాటు ఉండటం లేదు. నేటి జీవన విధానంలో ఆలుమగలు ఇద్దరూ పనికి వెళ్తే గానీ ఇల్లు గడవని పరిస్థితి. అలాంటి నేపధ్యంలో ఇంట్లోని అత్తమామల వేధింపుల కారణంగానో లేక భర్తతో వచ్చే విభేదాల వల్ల విడాకులే మార్గంమనుకొని కోర్టులను ఆశ్రయిస్తున్నారు. అలాగే ఆర్థిక స్వేచ్ఛ లేని కారణంగా కూడా మహిళలు పెళ్లి తరువాత ఇలాంటి నిర్ణయాలను తీసుకోవల్సి వస్తుంది.

ఇలాంటి వారందరికీ ఊరటనిస్తూ.. గతంలో చెప్పిన విధంగా ఆరునెలలు వేచిఉండే గడువును కొట్టివేస్తూ ఫాస్ట్ ట్రాక్ విడాకులు ఇచ్చేలా భారత అత్యున్నత ధర్మాసనం తీర్పు వెలవరించింది.ఇలాంటి అనివార్యమైన పరిస్థితులు కుటుంబ జీవన విధానంలో తలెత్తినప్పుడు భారత రాజ్యంగంలోని ఆర్టికల్ 142 క్రింద ఇలాంటి సంచలనమైన తీర్పులను ఇచ్చేందుకు గతంలో ఇచ్చిన వాటిని రద్దు చేసేందుకు అధికారాలు ఉంటాయని తెలిపింది.

సాధారణంగా హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13(బి) ప్రకారం ఇద్దరు వైవాహికులు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకునేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే చివరి వాయిదాలోని జడ్జిమెంట్ డే వరకూ సుదీర్ఘంగా కోర్డుకు చాలా సార్లు హాజరు కావల్సి ఉంటుంది. అనేక పర్యాయాలు వాయిదాలు పడుతూ ఉంటుంది. ఇలాంటి వాటికి చెక్ పెడుతూ ఆర్టికల్ 142 ను బ్రహ్మాస్త్రంగా ఉపయోగించింది.ఇలా చేయడం వల్ల ఫ్యామిలీ కోర్టులకు వెళ్లమని సూచించడానికి బదులు నేరుగా విడాకులు మంజూరు చేయవచ్చని దీని సారాంశం. అందుకనే సుప్రీం కోర్డు చెప్పిన విషయాన్ని ఇక్కడ మనం ఒకసారి పరిశీలించాలి. “ఆర్టికల్ 142 అనేది ప్రాథమిక హక్కులకు వెలుగు రేఖ లాంటిదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. దీనివల్లే పూర్తిస్థాయి న్యాయంతోపాటూ వాయిదాలకు తిరిగే సమయాన్ని వృధా చేయకుండా నిలువరించవచ్చు” అని తెలిపింది.

ఏడు సంవత్సరాల క్రితమే ఈ కేసు సుప్రీం కోర్ట్ లోని అప్పటి డివిజన్ బెంచ్ లోని జస్టీస్ కీర్తి సింగ్, జస్టిస్ ఆర్ భానుమతి (ఈవిడ విశ్రాంత న్యాయమూర్తి) రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేశారు. అప్పట్లో సుదీర్ఘ వాదనలు విన్న రాజ్యాంగ ధర్మాసనం గత సంవత్సరం సెప్టెంబర్ చివర్లో వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసినట్లు తెలిపారు. అప్పుడు రిజర్వ్ చేసి ఉంచిన తీర్పును ఇప్పుడు ఆదేశాలు జారీ చేసేందుకు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టీస్ సంజీవ్ కన్నా, జస్టిస్ ఏఎన్ ఓకా, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ జేకే మహేశ్వరీలు ముందుకు వచ్చారు. అలాగే భరణాన్ని ఎలా చెల్లించాలి, పిల్లల హక్కులకు సంబంధించి వారి పోషణ, ఎదుగుదల విషయంలో కూడా కీలకమైన సూచనలను చూస్తూ ఐదు మంది సభ్యులతో కూడిన భారత అత్యున్నత ధర్మాసనం సంచలనమైన తీర్పును సోమవారం నాడు అందించింది.

 

T.V.SRIKAR