Supreme Court : SC, ST వర్గీకరణ విచారణలో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. 6:1 తేడాతో వర్గీకరణ..
భారత దేశ ప్రధాన న్యాయమూర్తి ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం చారిత్రక తీర్పు ఇచ్చింది.
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణల్లో వర్గీకరణకు సుప్రీం కోర్టు చారిత్రత్మక తీర్పునిచ్చింది. గురువారం దీనిపై చేపట్టిన కోర్డు షెడ్యూల్ కులాలు SC, షెడ్యూల్డు తెగల STలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యలో వారికి కేటాయించిన రిజర్వేషన్లను వర్గీకరణ చేయడానికి సుప్రీం కోర్టు ఆమోదం తెలుపుతూ చారిత్రాత్మక తీర్పును ఇచ్చింది.
భారత దేశ ప్రధాన న్యాయమూర్తి ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం చారిత్రక తీర్పు ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ క్రమంలో గతంలో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టేసింది. ఏడుగురు న్యాయమూర్తుల్లో ఒక్క జస్టిస్ బేలా త్రివేది మాత్రం విరుద్ధమైన తీర్పును ఇచ్చారు. ఉపవర్గీకరణ సాధ్యం కాదని బేలా త్రివేది తన తీర్పులో పేర్కొన్నారు. దీంతో 6:1 తేడాతో ఎస్సీట, ఎస్టీ వర్గీకరణ తప్పనిసరి అని తేల్చి చేప్పేసింది. కాగా మన దేశంలో విద్య, ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల కోసం వర్గీకరణ జరుగుతోంది.