బ్రేకింగ్: జగన్ కేసులపై సుప్రీం జడ్జి సంచలన కామెంట్స్…!

జగన్ అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు సీరియస్ అయింది. సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్ లోని అంశాలు షాకింగ్ గా ఉన్నాయన్నారు జస్టీస్ సంజీవ్ ఖన్నా

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 7, 2024 | 01:52 PMLast Updated on: Aug 07, 2024 | 1:53 PM

Supreme Judge Sensational Comments On Jagans Cases

జగన్ అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు సీరియస్ అయింది. సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్ లోని అంశాలు షాకింగ్ గా ఉన్నాయన్నారు. మాజీ ఎంపి రఘురామకృష్ణ రాజు గతంలో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం… సిబిఐ దాఖలు చేసిన అఫిడవిట్‌లో చెప్పిన అంశాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. కేసులు ట్రయల్‌ ప్రారంభం కాకుండా… ఇన్ని కేసులు ఎలా ఫైల్‌ చేశారు అని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ప్రశ్నించారు.

ఆరుగురు జడ్జిలు మారిపోయారు, రిటైర్‌ అయ్యారని… గత పదేళ్లుగా ఇదే పనిలో ఉన్నారని ధర్మాసనం దృష్టికి రఘురామ తరపు న్యాయవాది తీసుకొచ్చారు. కోర్టులో వచ్చిన ఆదేశాలు తప్పు అని, ఇంకో కోర్టులో ఇచ్చిన ఉత్తర్వులు తప్పు అంటూ కాలయాపన చేస్తున్నారని అసహనం వ్యక్తం చేసారు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా. కోర్టుల ఉత్తర్వులు తప్పు అంటూ చేస్తున్న వ్యవహారానికి ట్రయల్‌కి సంబంధం లేదని జస్టిస్‌ ఖన్నా వ్యాఖ్యానించారు.

డిశ్చార్జ్‌ పిటిషన్లు వేస్తున్నారని, సాధారణ కార్యకలాపాలకు ఇది అడ్డంకిగా మారుతోందని రఘురామ తరపు న్యాయవాది వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టులో తాము కూడా అనేక పిటిషన్లు విచారించి డిశ్చార్జ్‌ చేస్తున్నాము.. ఎలాంటి అడ్డంకి తమకు రావడం లేదు అని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సంచలన వ్యాఖ్యలు చేసారు. సిబిఐ తరపు వాదనలు వినిపించడానికి ఎఎస్‌జి రాజు అందుబాటులో లేరని ఇతర న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఎఎస్‌జి రాజును వెంటనే పిలిపించాలని ధర్మాసనం పేర్కొంది.