బ్రేకింగ్: కలకత్తా డాక్టర్ ఫోటోలపై సుప్రీం కీలక ఆదేశాలు

సుప్రీంకోర్టు లో కొనసాగుతున్న కలకత్తా ఆర్జీ కర్ మెడికల్ కళాశాల హత్యాచార కేసు విచారణ జరిగింది. కలకత్తా హత్యాచార ఘటనపై దర్యాప్తుకు సిబిఐకి మరో వారం రోజుల గడువు ఇచ్చిన సుప్రీంకోర్టు... వచ్చే సోమవారం నాటికి తాజా కేసు దర్యాప్తు నివేదికను సమర్పించాలని ఆదేశించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 9, 2024 | 12:48 PMLast Updated on: Sep 09, 2024 | 12:48 PM

Supreme Key Orders On Calcutta Doctor Photos

సుప్రీంకోర్టు లో కొనసాగుతున్న కలకత్తా ఆర్జీ కర్ మెడికల్ కళాశాల హత్యాచార కేసు విచారణ జరిగింది. కలకత్తా హత్యాచార ఘటనపై దర్యాప్తుకు సిబిఐకి మరో వారం రోజుల గడువు ఇచ్చిన సుప్రీంకోర్టు… వచ్చే సోమవారం నాటికి తాజా కేసు దర్యాప్తు నివేదికను సమర్పించాలని ఆదేశించింది. వచ్చే మంగళవారం సీబీఐ దర్యాప్తు నివేదికపై విచారణ జరుపుతామని పేర్కొంది. ఘటన తర్వాత బాధితురాలి శరీరం పై గాయాలున్నాయని సుప్రీంకోర్టుకు సోలిసిటరీ జనరల్ తుషార్ మెహతా తెలిపారు.

బెంగాల్ ప్రభుత్వం పరీక్ష జరిపిన ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఎయిమ్స్ కి పంపి పరిశీలించాలని సీబీఐ నిర్ణయించినట్లు సుప్రీంకోర్టు దృష్టికి సోలిసిటరీ జనరల్ తుషార్ మెహతా తీసుకువెళ్ళారు. దర్యాప్తు లో భాగంగా సీసీటీవీ ఫుటేజిని తాము పరిశీలిస్తున్నామని సుప్రీంకోర్టుకు సీబీఐ వివరణ ఇచ్చింది. సిఐఎస్ఎఫ్ సిబ్బందికి బెంగాల్ ప్రభుత్వం సహకరించడం లేదని సుప్రీంకోర్టు ముందు ఉంచింది కేంద్రం. ఆర్జీకర్ ఆసుపత్రి వద్ద మూడు మహిళా సిఐఎస్ఎఫ్ కంపెనీలు ఉంటే ఒక కంపెనీకి మాత్రమే వసతులు కల్పించినట్లు కేంద్రం తెలపగా మేము వసతులు కల్పించామని బెంగాల్ ప్రభుత్వం సమాధానం ఇచ్చింది.

మూడు వారాల తరువాత సిఐఎస్ఎఫ్ కి సదుపాయాలు కల్పించారని కేంద్రం పేర్కొంది. బెంగాల్ లో వైద్యుల భద్రతకు తీసుకున్న చర్యలపై స్టేటస్ రిపోర్ట్ ను బెంగాల్ సర్కార్ సుప్రీం ముందు ఉంచింది. ఇక విచారణ సందర్భంగా సుప్రీం కోర్ట్ కీలక ఆదేశాలు ఇచ్చింది. అర్జీ కర్ ఆస్పత్రి బాధితురాలి ఫోటోలను సోషల్ మీడియా నుంచి వెంటనే తొలగించాలని స్పష్టం చేసింది.