టీమిండియా ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్, వన్డేలకు కొత్త జెర్సీ ఆవిష్కరణ
భారత క్రికెట్ జట్లు కొత్త లుక్ లో కనిపించబోతున్నాయి. పురుషుల, మహిళల జట్లకు సంబంధించి వన్డేల్లో ధరించేందుకు బీసీసీఐ కొత్త జెర్సీని లాంఛ్ చేసింది.
భారత క్రికెట్ జట్లు కొత్త లుక్ లో కనిపించబోతున్నాయి. పురుషుల, మహిళల జట్లకు సంబంధించి వన్డేల్లో ధరించేందుకు బీసీసీఐ కొత్త జెర్సీని లాంఛ్ చేసింది. ముంబైలో జరిగిన కార్యక్రమంలో బీసీసీఐ సెక్రటరీ జైషా, భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ వన్డే జెర్సీని ఆవిష్కరించారు. డిసెంబర్ 22 నుంచి విండీస్ తో జరిగే వన్డే సిరీస్ లో వుమెన్ టీమ్ కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. ఇండియా ట్రై కలర్స్ తో ప్రముఖ స్పోర్ట్ బ్రాండ్ అడిడాస్ మరింత ఆకర్షణీయంగా ఈ జెర్సీని రూపొందించింది. ఇక వన్డేల్లో మెన్, వుమెన్ టీమ్స్ రెండూ కూడా ఈ కొత్త జెర్సీలోనే మ్యాచ్ లు ఆడనున్నాయి.