Pakistan: మాదొక చెత్త జట్టు అందరూ ఆవేశం స్టార్స్
వన్డే వరల్డ్ కప్కు సమయం దగ్గర పడుతుంది. ఇప్పటికే పలు దేశాల జట్టు వార్మప్ మ్యాచ్ ప్రారంభించగా.. అక్టోబర్ 5 నుంచి లీగ్ మ్యాచ్ లు మొదలవనున్నాయి.

Pakistan player Waqar surprisingly said that the cause of his stress was the noise and commotion of the fans in the stadium.
వన్డే వరల్డ్ కప్కు సమయం దగ్గర పడుతుంది. ఇప్పటికే పలు దేశాల జట్టు వార్మప్ మ్యాచ్ ప్రారంభించగా.. అక్టోబర్ 5 నుంచి లీగ్ మ్యాచ్ లు మొదలవనున్నాయి. ఇవాళ న్యూజిలాండ్ తో కలిసి ఉప్పల్ స్టేడియంలో వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. ఈ క్రమంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. ప్రపంచకప్ ఆడేందుకు వెళ్లిన పాకిస్థాన్ జట్టు భారత్‌తో పోలిస్తే చాలా బలహీనంగా ఉందని పేర్కొన్నాడు. అంతేకాకుండా.. అక్టోబరు 14న భారత్-పాకిస్థాన్ మధ్య జరగనున్న మ్యాచ్‌కు సంబంధించి కీలక ప్రకటన చేశాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటి వరకు టీమిండియా పాకిస్తాన్‌తో ఒక్కసారి కూడా ఓడిపోలేదన్నాడు. స్టార్ స్పోర్ట్స్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ గురించి వకార్ యూనిస్ మాట్లాడుతూ.. అక్టోబర్ 14న జరిగే ఈ మ్యాచ్ ఈ మెగా ఈవెంట్‌లో బిగ్గెస్ట్ మ్యాచ్ అవుతుందని తెలిపాడు.
ఈ మ్యాచ్ లో పాక్ జట్టుపై చాలా ఒత్తిడి ఉంటుంది.. దాంతో పాటు భారత్ కూడా ఒత్తిడికి గురవుతుందని చెప్పాడు. ఎందుకంటే స్టేడియంలో ఉన్న అభిమానుల కోలాహలం, సందడి వారిపై ఒత్తిడి తెస్తుందని అన్నాడు. టీమిండియా గురించి మాట్లాడుతూ.. భారత జట్టు చాలా బలంగా ఉందని చెప్పాడు. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా రూపంలో ఇద్దరు అద్భుతమైన స్పిన్నర్లు ఉన్నారన్నాడు. అంతే కాకుండా.. వారి జట్టు బెంచ్ బలం కూడా చాలా బలంగా ఉందని.. ఒకవేళ ఆటగాడు గాయం కారణంగా తప్పుకుంటే, అతని స్థానంలో మరో ఆటగాడు కూడా మంచి ప్రదర్శన చేయగలడని తెలిపాడు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌తో ఏ జట్టు పోటీ పడటం అంత సులువు కాదని చెప్పుకొచ్చాడు. మరోవైపు పాకిస్తాన్ జట్టు నసీమ్ షాను మిస్సవుతుందని చెప్పాడు. నసీమ్ షా భుజం గాయం కారణంగా ఈ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. నసీమ్ వకార్ యూనిస్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ బౌలర్లలో షాహీన్, నసీమ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తారని.. నసీమ్ లేని లోటు పాకిస్తాన్ టీమ్ కు కనిపిస్తుందని అన్నాడు