SURVEYS CONFUSION: తెలంగాణలో సర్వేల గందరగోళం.. ఓటర్ల మనస్సులో ఏముందో !
అక్టోబర్, నవంబర్.. ఈ రెండు నెలల్లో డజనకుపైగా సంస్థలు పోల్ సర్వే నిర్వహించాయి. జాతీయస్థాయిలో చర్చకు దారితీసిన తెలంగాణ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందన్నదానిపై గత రెండు నెలలు రకరకాల సర్వేలు వెల్లడి అయ్యాయి.
SURVEYS CONFUSION: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈసారి దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. బీజేపీ, కాంగ్రెస్ కి చెందిన ఢిల్లీ స్థాయిలో పెద్దలు వచ్చి తమ పార్టీ అభ్యర్థుల తరపున ఇక్కడ ప్రచారం చేశారు. దాంతో సహజంగానే నేషనల్ మీడియా, నేషనల్ పోల్ సర్వే సంస్థలు తెలంగాణపై దృష్టిపెట్టాయి. అక్టోబర్, నవంబర్.. ఈ రెండు నెలల్లో డజనకుపైగా సంస్థలు పోల్ సర్వే నిర్వహించాయి. జాతీయస్థాయిలో చర్చకు దారితీసిన తెలంగాణ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందన్నదానిపై గత రెండు నెలలు రకరకాల సర్వేలు వెల్లడి అయ్యాయి.
ASSEMBLY ELECTIONS: కారుకి కలిసొస్తున్న 20 సీట్లు.. ఓట్లు చీల్చిపెడుతున్న కమలం
వీటిల్లో కొన్ని సంస్థలు బీఆర్ఎస్ కి అధికారం దక్కుతుందని అంటే.. మరికొన్ని మాత్రం కాంగ్రెస్ పగ్గాలు చేపడుతుందని చెప్పాయి. అక్టోబర్ లో ఇచ్చిన సర్వేలకూ.. నవంబర్ లో పోలింగ్ డేట్ ముందు వరకూ వచ్చిన సర్వేల్లో చాలా తేడాలు కనిపించాయి. అప్పుడు బీఆర్ఎస్ కి ఎడ్జ్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ కి అని.. కొన్ని సంస్థలు చెప్పాయి. నాలుగు రోజుల క్రితం వచ్చిన ఓ సర్వే అయితే.. బీఆర్ఎస్ కి 14 సీట్లు కంటే ఎక్కువ రావని చెప్పింది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో అన్న అనుమానాలున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. గెలిచిన సీట్ల సంఖ్యలో స్వల్పంగా తేడాలు ఉండే ఛాన్సుంది. ఎందుకంటే అన్ని నియోజకవర్గాల్లోనూ టఫ్ ఫైట్ నడుస్తోంది. క్లీన్ స్వీప్ చేసే పరిస్థితి అయితే ఏ పార్టీకి ఉండదు. కానీ తెలంగాణలో హంగ్ వస్తుందని కొన్ని సర్వేలు వెల్లడించాయి. అదే జరిగితే బీజేపీ కింగ్ మేకర్ గా మారుతుందన్న ఊహాగానాలు కూడా నడిచాయి. కానీ హంగ్ వస్తుందని చెప్పిన సర్వేలను మూడు పార్టీలు కొట్టిపారేశాయి.
ఇలాంటి సర్వేలు మీ పార్టీ చేయించింది అంటే మీ పార్టీ చేయించింది.. అని ఒకరిపై ఒకరు విమర్శించుకున్నారు. మొత్తమ్మీద అన్ని సర్వేలు తెలంగాణ ప్రజలను గందరగోళంలో పడేశాయి. అదేసమయంలో కొన్ని సర్వేలపై విమర్శలు కూడా వచ్చాయి. పార్టీలే తమకు అనుకూలంగా తెలంగాణ జనం మూడ్ మార్చేందుకు సర్వేలు అనుకూలంగా చేయించుకున్నాయన్న టాక్ సోషల్ మీడియాలో నడిచింది. కానీ ఏ సర్వే ఎలా ఉన్నా.. అంతిమంగా ప్రజలు ఎవరికి ఓటు వేస్తారు.. ఎవర్ని అధికారంపై కూర్చోబెడతారు అన్నది డిసెంబర్ 3 నాడు తేలనుంది.