ఎక్స్ ట్రాలు చెయ్యకు, సఫారీ పేసర్ కు ఇచ్చిపడేసిన సూర్య

సౌతాఫ్రికాతో శుక్ర‌వారం జ‌రిగిన తొలి టీ20లో టీమిండియా ఘ‌న విజ‌యం సాధించింది. సంజూ శాంస‌న్ మెరుపు సెంచ‌రీతో భార‌త జ‌ట్టుకు అద్భుత విజ‌యాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లకు 202 ప‌రుగులు చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 9, 2024 | 03:59 PMLast Updated on: Nov 09, 2024 | 3:59 PM

Surya Kumar Yadav Warning To South Africa Bowler

సౌతాఫ్రికాతో శుక్ర‌వారం జ‌రిగిన తొలి టీ20లో టీమిండియా ఘ‌న విజ‌యం సాధించింది. సంజూ శాంస‌న్ మెరుపు సెంచ‌రీతో భార‌త జ‌ట్టుకు అద్భుత విజ‌యాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లకు 202 ప‌రుగులు చేసింది. ల‌క్ష్య ఛేద‌న‌లో భార‌త బౌల‌ర్లు చెల‌రేగ‌డంతో 17.5 ఓవ‌ర్ల‌లో 141 ప‌రుగుల‌కే సౌతాఫ్రికా ఆలౌటైంది. అయితే దక్షిణాఫ్రికా టీమ్‌ 12 ఓవర్లు ముగిసే సమయానికి 87/5తో ఓటమిని ఖాయం చేసుకుంది. దాంతో దక్షిణాఫ్రికా బ్యాటర్లు సహనం కోల్పోయారు.

ఇన్నింగ్స్ 15 ఓవర్‌లో ఫీల్డర్ విసిరిన బంతిని అందుకునే క్రమంలో భారత వికెట్ కీపర్ సంజు శాంసన్ పిచ్ డేంజర్ జోన్‌లో అడుగుపెట్టాడు. దాంతో దక్షిణాఫ్రికా క్రికెటర్ మార్కో జాన్సెన్.. పిచ్ డేంజర్ జోన్‌లో ఎందుకు అడుగుపెడుతున్నావ్ అంటూ సంజు శాంసన్‌తో గొడవపడ్డాడు.
సంజు శాంసన్‌‌తో జాన్సెన్ మాటల యుద్ధానికి దిగడంతో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అతనికి గట్టిగా ఇచ్చి పడేసాడు. ఏవైనా ఉంటే అంపైర్‌కి ఫిర్యాదు చేయాలి తప్ప ఇలా చేయడమేంటి అంటూ వార్నింగ్ ఇచ్చాడు. సూర్య రావడంతో మరో ఎండ్‌లో ఉన్న దక్షిణాఫ్రికా బ్యాటర్ గెరాల్డ్ కూడా అక్కడికి వచ్చాడు. దాంతో జాన్సెన్, గెరాల్డ్‌ ఇద్దరితో సూర్యకుమార్ యాదవ్ మాటకి మాట బదులిస్తూ వాగ్వాదానికి దిగాడు.

ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య వాగ్వాదం పెరగడంతో ఫీల్డ్ అంపైర్లు పరుగెత్తుకొచ్చి.. సర్దిచెప్పారు. అయినప్పటికీ.. మ్యాచ్ ముగిసే వరకూ సూర్య కోసం చల్లారినట్లు లేదు. ఈ గొడవ జరిగిన కాసేపటికే జాన్సెన్‌‌ని రవి బిష్ణోయ్ ఔట్ చేయగా.. గెరాల్డ్‌ని సూర్యకుమార్ యాదవ్ రనౌట్ చేసి రివేంజ్ తీర్చుకున్నాడు. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇలా మ్యాచ్‌ల్లో గొడవ పడటం చాలా అరుదుగా చూస్తుంటాం. ప్రత్యర్థి ఆటగాళ్లు తనపై స్లెడ్జింగ్‌కి దిగినా.. నవ్వుతూ బ్యాట్‌తోనే సమాధానం చెప్తుంటాడు. కానీ.. ఇదే మ్యాచ్‌లో సెంచరీ బాదిన సంజు శాంసన్‌పై కావాలనే దక్షిణాఫ్రికా ప్లేయర్లు గొడవపెట్టుకోవడంతో ఒక కెప్టెన్‌గా ప్లేయర్‌కి అండగా నిలిచాడు.