పింక్ టెస్ట్ గా సిడ్నీ మ్యాచ్, కారణమేమిటో తెలుసా
భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చివరి టెస్ట్ సిడ్నీ వేదికగా జరగబోతోంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా క్రికెటర్లు పింక్ కలర్ కాంబినేషన్ తో ఉన్న జెర్సీ, క్యాప్ లను ధరించబోతున్నారు.
భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చివరి టెస్ట్ సిడ్నీ వేదికగా జరగబోతోంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా క్రికెటర్లు పింక్ కలర్ కాంబినేషన్ తో ఉన్న జెర్సీ, క్యాప్ లను ధరించబోతున్నారు. పింక్ జెర్సీ దర్శించడానికి… ప్రత్యేక కారణం కూడా ఉంది. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం గ్లెన్ మెక్ గ్రాత్ భార్య క్యాన్సర్ తో కన్నుమూశారు. అప్పటి నుంచీ బ్రెస్ట్ క్యాన్సర్ పైన అవగాహన కల్పిస్తూ మెక్ గ్రాత్ ఓ ఫౌండేషన్ స్థాపించాడు. ఈ ఫౌండేషన్ కోసం నిధుల సేకరణలో భాగంగా ఆసీస్ క్రికెట్ బోర్డు పింక్ టెస్ట్ నిర్వహిస్తోంది. తద్వారా డబ్బులు సేకరించి చాలామందికి వైద్యం అందిస్తున్నారు. అందుకే ఈ మ్యాచ్ లో ఆసీస్ క్రికెటర్లు పింకు బోర్డర్ ఉన్న జెర్సీలతో పాటు గులాబీ క్యాప్ లను ధరిస్తారు.