KHAMMAM MP TICKET: ఖమ్మం టికెట్ కోసం ఇద్దరు మంత్రుల లొల్లి.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన డీకే!
బీఆర్ఎస్, బీజేపీ సంగతి ఎలా ఉన్నా.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌లో జోష్ మాములుగా లేదు. ఐతే కాంగ్రెస్ మరో మూడు స్థానాల్లో అభ్యర్దులను బ్యాలెన్స్ పెట్టింది. అందులో కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్, హైదరాబాద్ నుంచి సమీరుల్లా ఖాన్ పేర్లు దాదాపు ఖరారయ్యాయ్.
KHAMMAM MP TICKET: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోరు ఆసక్తి రేపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఎంపీ ఎలక్షన్స్‌లోనూ సత్తా చాటాలని పట్టుదలతో ఉంది. ఇక అటు బీజేపీ కూడా తగ్గేదే లేదు అంటోంది. టార్గెట్ టెన్ అంటూ.. దూసుకుపోతంది. కేసీఆర్ బస్సు యాత్రకు సిద్ధం అవుతున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య.. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్, బీజేపీ సంగతి ఎలా ఉన్నా.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌లో జోష్ మాములుగా లేదు.
Manushi Chiller : రూ.350 కోట్ల సినిమాను రిజెక్ట్ చేసి తప్పు చేసిందా…
ఐతే కాంగ్రెస్ మరో మూడు స్థానాల్లో అభ్యర్దులను బ్యాలెన్స్ పెట్టింది. అందులో కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్, హైదరాబాద్ నుంచి సమీరుల్లా ఖాన్ పేర్లు దాదాపు ఖరారయ్యాయ్. ఐతే ఖమ్మం సీటు విషయంలోనే అసలైన పోటీ కనిపిస్తోంది. రాష్ట్ర కేబినెట్‌లో కీలకంగా ఉన్న ఇద్దరు ఇద్దరు ఖమ్మం జిల్లా మంత్రులు.. తమ వారికి టికెట్ దక్కేలా పాచికలు కదుపుతున్నారు. పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. తన తమ్ముడు ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని పట్టిన పట్టు వీడకుండా ఉంటే.. డిప్యూటీ సీఎం భట్టి తన భార్యకు టికెట్ ఇప్పించుకోవాలని అనుకుంటున్నారు. తన భార్యకు కాకపోతే.. రాయల నాగేశ్వరరావుకు టికెట్ ఇవ్వాలన్నది భట్టి పట్టుదల. రాయలకు మరో నేత తుమ్మల సపోర్ట్ కూడా ఉంది. ఇలాంటి పరిణామాల మధ్య.. ఈ పంచాయితీ బెంగుళూరులోని డీకే శివకుమార్ దగ్గరకు చేసింది.
ఐతే ఈ ఇద్దరు మంత్రులకు.. డీకే దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అభ్యర్థి ఎవరు అనే విషయం చెప్పకుండా.. సాఫ్ట్ వార్నింగ్ ఇచ్చినట్లు టాక్. ఎవరికి టికెట్ ఇచ్చినా.. అందరూ కలిసి పని చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇద్దరు సూచించిన వారికి కాకుండా కొత్త పేరు తెర మీదకు తెచ్చినట్లు సమాచారం. స్థానిక సమీకరణాల్లో భాగంగా.. సీనియర్ నేత మండవ వెంకటేశ్వర రావు పేరు తెరపైకి వచ్చింది. మరి దీని మీద కాంగ్రెస్ నిర్ణయం ఎలా ఉండబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.