క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకోండి, విరాట్ ,రోహిత్ లకు బ్రెట్ లీ సూచన
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం పేలవ ఫామ్ తో సతమతమవుతున్నారు. గత కొన్ని నెలలుగా చెప్పుకోగదగిన ఇన్నింగ్స్ ఒక్కటి కూడా ఆడలేకపోయారు. దీంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వీరిద్దరి కెరీర్ కే కీలకంగా మారింది.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం పేలవ ఫామ్ తో సతమతమవుతున్నారు. గత కొన్ని నెలలుగా చెప్పుకోగదగిన ఇన్నింగ్స్ ఒక్కటి కూడా ఆడలేకపోయారు. దీంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వీరిద్దరి కెరీర్ కే కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఆసీస్ మాజీ బౌలర్ బ్రెట్ లీ కీలక సూచన చేశాడు. కోహ్లీ, రోహిత్ కొంతకాలం ఆట నుంచి బ్రేక్ తీసుకోవాలని సూచించాడు. ఫామ్ కోల్పోవడంతో వారిద్దరిపై అనవసరంగా ఒత్తిడి పెరిగిందన్నాడు. కొన్ని రోజులు బ్రేక్ తీసుకుని మళ్ళీ ఫ్రెష్ గా గ్రౌండ్ అడుగుపెడితే ఫామ్ అందుకోవచ్చని బ్రెట్ లీ వ్యాఖ్యానించాడు. ఇప్పటికీ రోహిత్ , కోహ్లీ వరల్డ్ క్లాస్ బ్యాటర్లేనని, తమ బలహీనతనలు అధిగమించడం పెద్ద కష్టం కాదని అభిప్రాయపడ్డాడు.