AYODHYA AKSHINTALU: అయోధ్య అక్షింతలు తీసుకుంటున్నారా ? చందాలు ఇవ్వకండి !!
ఇప్పుడు దేశమంతటా ఒకటే చర్చ.. మీకు అయోధ్య (Ayodhya) అక్షింతలు వచ్చాయా .. అని ఒకరినొకరు అడుగుతున్నారు. ఈ జనవరి 1 నుంచి అయోధ్య అక్షింతలను ఇంటింటికీ చేర్చే కార్యక్రమం మొదలైంది. ఇది ఈనెల 15 దాకా కొనసాగనుంది.
ఇప్పుడు దేశమంతటా ఒకటే చర్చ.. మీకు అయోధ్య (Ayodhya) అక్షింతలు వచ్చాయా .. అని ఒకరినొకరు అడుగుతున్నారు. ఈ జనవరి 1 నుంచి అయోధ్య అక్షింతలను ఇంటింటికీ చేర్చే కార్యక్రమం మొదలైంది. ఇది ఈనెల 15 దాకా కొనసాగనుంది. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి అయోధ్య అక్షింతలతో పాటు.. శ్రీరాముని (God Sri Ram) ఫోటోను కూడా ఇస్తున్నారు. జనవరి 22న అయోధ్య గర్భాలయంలో బాలరాముడి (Bala Ram) విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి కుటుంబం కూడా టీవీలు, సోషల్ మీడియా ద్వారా ప్రత్యక్ష ప్రసారాల ద్వారా చూడాలి. ఆ కార్యక్రమం పూర్తయ్యాక… శ్రీరామ అక్షింతలు తలపై చల్లుకుంటే ఆ సీతారామ చంద్రుల వారి ఆశీర్వాదం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఆ రోజు రాత్రి ప్రతి ఇంటి ముందు కూడా 5 దీపాలు వెలిగించి పండగ చేసుకోవాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర టస్ట్ చెబుతోంది.
అయోధ్య అక్షింతలు పంపిణీ కార్యక్రమం ఊరు, వాడా… పల్లె, పట్నం అని తేడా లేకుండా అన్నిచోట్లా జరుగుతున్నాయి. కొన్ని కాలనీల్లో రామ భక్తులు మేళతాళాలతో వెళ్ళి ఇంటింటికీ వెళ్ళి అక్షింతలు అందజేస్తున్నారు. అయితే కొన్ని చోట్ల అక్షింతలు పంచిపెడుతున్న నిర్వాహకులు హుండీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ హుండీలు అయోధ్య రామాలయం (Ayodhya Ramalayam) కోసమని భక్తులు భ్రమపడుతున్నారు. వాటిల్లో డబ్బులు వేస్తున్నారు. గతంలో కూడా ఇలాగే కొందరు మోసగాళ్ళు… రామాలయం పేరుతో కూడా చందాలు వసూలు చేశారు. ఆలయ నిర్మాణానికి సహకరించాలంటూ పాంప్లేట్స్, హుండీలతో ప్రచారం చేశారు. ఈ వ్యవహారం ట్రస్ట్ దృష్టికి రావడంతో… ఆలయ నిర్మాణానికి ఎలాంటి చందాలు ఇవ్వొద్దని ట్రస్ట్ బాధ్యులు ప్రకటించారు. అలాగే అక్షింతల విషయంలోనూ మోసపోవద్దని చెబుతున్నారు ట్రస్ట్ సభ్యులు. ఎవరైనా హుండీలు పట్టుకొస్తే… ఎలాంటి డబ్బులు, బంగారం వేయవద్దని సూచిస్తున్నారు. అక్షంతలు మాత్రమే తీసుకోవాలని ట్రస్ట్ సభ్యులు సూచిస్తున్నారు.