Talasani Srinivas Yadav: రేవంత్ రెడ్డి మూర్ఖుడు.. నోరుకు అడ్డూ, అదుపు లేదు: తలసాని
నియోజకవర్గంలో ఉన్న ప్రజా ప్రతినిధులను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నాడని, ప్రజలు రేవంత్ రెడ్డి భాషను గమనించాలని కోరారు తలసాని. రేవంత్ రెడ్డి ఒక్కడికే అలాంటి భాష వస్తుందా అని, తాము కూడా మాట్లాడగలమని హెచ్చరించారు.
Talasani Srinivas Yadav: రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఒక మూర్ఖుడని.. PCC ప్రెసిడెంట్‌గా ఉన్న వ్యక్తి నోటికి హద్దూ, అదుపూ లేకుండా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. హోదా కలిగిన వ్యక్తిపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడని విమర్శించారు. నియోజకవర్గంలో ఉన్న ప్రజా ప్రతినిధులను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నాడని, ప్రజలు రేవంత్ రెడ్డి భాషను గమనించాలని కోరారు తలసాని. రేవంత్ రెడ్డి ఒక్కడికే అలాంటి భాష వస్తుందా అని, తాము కూడా మాట్లాడగలమని హెచ్చరించారు.
MLC KAVITHA: బీసీల సీట్లు అగ్రవర్ణాలకు అమ్ముకున్న కాంగ్రెస్: ఎమ్మెల్సీ కవిత
నీచంగా మాట్లడటం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. తనతో పాటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఇష్టం వచ్చినట్లు తిడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ దీన్ని గమనించాలని కోరారు తలసాని శ్రీనివాస్ యాదవ్. తొమ్మిదిన్నర ఏళ్లలో తెలగాణ అద్భుతంగా అభివృద్ది చెందిందనీ.. మూడోసారి కూడా తామే అధికారంలోకి వస్తున్నామన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో అన్ని సీట్లు గెలుస్తున్నామని చెప్పారు. ఈనెల 25న సిటీలో సీఎం KCR సభ ఉంటుందని తలసాని చెప్పారు. సభ స్థలాలు రెండు చోట్ల అనుకున్నామనీ.. ఒకట్రెండు రోజుల్లో సభ స్థలం ఖరారు చేస్తామని చెప్పారు. “కాంగ్రెస్ ఇస్తున్న డిక్లరేషన్లు ఎవరిని అడగాలి. ఇతర రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు వచ్చి గ్యారంటీలు, డిక్లరేషన్ ప్రకటిస్తున్నారు. జనం ఎక్కడికి వెళ్ళాలి..? ఎవడిని అడగాలి..? అవి అమలయ్యేవి కాదు.
ఈటెల రాజేందర్, రేవంత్ రెడ్డి ఇద్దరు అతిగా ఊహించుకుంటున్నారు. కొడంగల్‌లో రేవంత్ రెడ్డి, హుజురాబాద్‌లో ఈటెల ఇద్దరు ఓడిపోడుతున్నారు. సీఎం మీద ఓడిపోయాను అని అధిష్టానానికి చెప్పుకోవడానికే పోటీలో నిలబడినట్టుంది” అని వ్యాఖ్యానించారు తలసాని.