హెడ్ కోచ్ లా మాట్లాడు, గంభీర్ పై పాంటింగ్ ఫైర్

భారత్ తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆ దేశ మాజీ ఆటగాళ్ళు మాటల యుద్ధం మొదలుపెట్టారు. తాజాగా ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై విరుచుకుపడ్డాడు. కోహ్లీపై పాంటింగ్ చేసిన కామెంట్స్ కు ఇటీవల గంభీర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 13, 2024 | 06:25 PMLast Updated on: Nov 13, 2024 | 6:25 PM

Talk Like A Head Coach Ponting Fire On Gambhir

భారత్ తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆ దేశ మాజీ ఆటగాళ్ళు మాటల యుద్ధం మొదలుపెట్టారు. తాజాగా ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై విరుచుకుపడ్డాడు. కోహ్లీపై పాంటింగ్ చేసిన కామెంట్స్ కు ఇటీవల గంభీర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. పాంటింగ్ కు భారత ఆటగాళ్ళ గురించి ఎందుకంటూ ఘాటుగా స్పందించాడు. ఇప్పుడు గంభీర్ వ్యాఖ్యలపై స్పందించిన పాంటింగ్ తాను కోహ్లీని కించపరచలేదంటూ వివరణ ఇచ్చుకుంటున్నాడు. తానేమీ కోహ్లీని అపహాస్యం చేసేలా మాట్లాడలేదని, గత మూడేళ్లలో అతని సెంచరీల సంఖ్య తగ్గిందని మాత్రమే అన్నానంటూ యూటర్న్ తీసుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నేపథ్యంలో
కోహ్లీ ఫామ్‌పై ఇటీవల పాంటింగ్ ఆందోళన వ్యక్తం చేశాడు. గత మూడేళ్లలో విరాట్ కోహ్లీ మూడు టెస్ట్ శతకాలు మాత్రమే చేశాడని, అతని ఫామ్ ఆందోళన పరిచే విషయమేనని అభిప్రాయపడ్డాడు. అతని వ్యాఖ్యలను విలేఖరులు గంభీర్ ముందు ప్రస్తావించగా పాంటింగ్ పై ఫైర్ అయ్యాడు. కోహ్లీ, రోహిత్ ఫామ్‌పై తమకు ఎలాంటి ఆందోళన లేదని చెప్పాడు.

అసలు భారత క్రికెట్‌తో పాంటింగ్‌కు ఏం పని అంటూ గంభీర్ నిలదీసాడు. ఆయన ఆస్ట్రేలియా క్రికెట్‌ గురించి ఆలోచిస్తే మంచిదని చురకలంటించాడు. ఈ వ్యాఖ్యలపై తాజాగా మాట్లాడిన పాంటింగ్ గంభీర్ హెడ్ కోచ్ అని మరిచిపోయి మాట్లాడుతున్నాడంటూ వ్యాఖ్యానించాడు. గతంలో ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లీ అద్భుతంగా ఆడాడనీ, కానీ ప్రస్తుతం ఫామ్ కోల్పోవడంపైనే తాను కామెంట్స్ చేశానంటూ పాంటింగ్ చెప్పుకొచ్చాడు. సాధారణంగా గంభీర్ వ్యాఖ్యలకు తాను ఆశ్చర్యపోయేవాడిని కాదనీ, ఓ జట్టు ప్రధాన కోచ్‌గా అతను మాట్లాడిన తీరే ఆశ్చర్యకరంగా ఉందన్నాడు.

మరోవైపు ఇటీవల ప్రెస్ మీట్ లో గౌతమ్ గంభీర్ మాట్లాడిన తీరును పలువురు మాజీ క్రికెటర్లు తప్పుపడుతున్నారు. టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ సంజయ్‌ మంజ్రేకర్‌ కూడా గంభీర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. అతన్ని మీడియా సమావేశాలకు దూరం ఉంచడం బెటర్‌ అంటూ బీసీసీఐకి సూచించాడు. తెర వెనుక పనిచేసుకోనివ్వండి. రోహిత్‌శర్మ, అజిత్‌ అగార్కర్‌.. హాజరుకావడం మంచిదంటూ మంజ్రేకర్ ట్వీట్ చేశాడు. కాగా రోహిత్ తొలి టెస్టుకు అందుబాటులో ఉంటాడా అన్న ప్రశ్నకు క్లారిటీ లేదంటూ గంభీర్ చెప్పడం చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే భారత్ తో టెస్ట్ సిరీస్ కు ముందు ఆసీస్ మాజీలు ఇలా ఏదో ఒకటి మాటలతో రెచ్చగొడుతూ ఉంటారంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.