Ashok Selvan: పెళ్లి చేసుకున్న హీరో హీరోయిన్
గెస్ట్ రోల్స్ చేస్తూ వెండితెరపై కనిపించే నటుడు సెల్వన్ పెళ్లి చేసుకున్నారు.

Tamil hero Ashok is going to marry Arun Pandian's daughter Keerthy Pandian
తమిళ నటుడు అశోక్ సెల్వన్ ఓ ఇంటి వాడు అయ్యాడు. తెలుగు ప్రేక్షకులకు కూడా అశోక్ మంచి పరిచయం. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన నిన్నిలా నిన్నిలాలో హీరో మనోడే ! విశ్వక్ సేన్ హీరోగా యాక్ట్ చేసిన అశోక వనంలో అర్జున కళ్యాణంలోనూ అలా గెస్ట్ రోల్‌లో కనిపిస్తాడు అశోక్. ఓ తెలుగు సినిమాలో హీరోగా నటించడం, మరో తెలుగు సినిమాలో అతిథి పాత్ర చేయడంతో పాటు.. డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు అశోక్ సెల్వన్ దగ్గర అయ్యాడు. పొర్ థాంజల్ మూవీతో మరింత క్లోజ్ అయ్యాడు.
అలాంటి అశోక్ ఇప్పుడో ఓ ఇంటివాడు అయ్యారు. హీరోయిన్ కీర్తీ పాండియన్ మెడలో ఆయన మూడు ముడులు వేశారు. తమిళనాడులోని తిరుణవేలిలో జరిగిన ఈ వివాహానికి నూతన వధూవరుల కుటుంబ సభ్యులతో పాటు అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరు అయ్యారు. కీర్తి పాండియన్‌తో అశోక్ సెల్వన్ కొద్దిరోజులుగా ప్రేమలో ఉన్నాడు. అది కాస్త ఇప్పుడు పెళ్లి పీటల వరకు వెళ్లింది. కీర్తి పాండియన్ కూడా పలు తమిళ సినిమాల్లో యాక్ట్ చేసింది. ఇంకో విషయం ఏంటంటే.. ఫైటింగ్ స్టార్‌గా 90ల్లో ఫేమస్ అయిన హీరో, యాక్టర్ అరుణ్ పాండియన్ కుమార్తెనే ఈ కీర్తి పాండియన్.
అశోక్ సెల్వన్, కీర్తీ పాండియన్ కలిసి ఇప్పుడు ఓ సినిమా చేస్తున్నారు. బ్లూ స్టార్ అనే మూవీలో జంటగా నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్‌లో మొదలైన పరిచయం.. ఆ తర్వాత ప్రేమగా మారిందని చెన్నై సినిమా వర్గాల ఖబర్. ఐతే తమ ప్రేమ విషయాన్ని వీళ్ళిద్దరూ తొలుత రహస్యంగా ఉంచారు. కుటుంబ సభ్యుల మధ్య నిశ్చితార్థం చేసుకున్నారు. రమ్యా పాండియన్ చేసిన ట్వీట్ కారణంగా వాళ్ళ విషయం బయటకు వచ్చింది. తమిళ్‌లో హీరో హీరోయిన్ల పెళ్లిళ్లు అన్ని సూపర్ సక్సెస్. సూర్య, జ్యోతిక.. అజిత్, షాలిని.. ఇలా దంపతుల లిస్ట్ భారీగానే ఉంది. వాళ్లలా మీరు కూడా కలకాలం హ్యాపీగా ఉండాలి అంటూ విషెస్ చెప్తున్నారు ఫ్యాన్స్.