Governor Ravi: పది బిల్లులు తిప్పిపంపిన తమిళనాడు గవర్నర్ రవి..
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి 10 బిల్లులను తిప్పి పంపడం వివాదాస్పదమైంది. గవర్నర్ రవి, సీఎం స్టాలిన్ మధ్య కొంత కాలంగా వివాదం నడుస్తోంది. గవర్నర్ వైఖరిని డీఎంకే తప్పుబడుతోంది. పార్టీ కార్యకర్తలు గవర్నర్‌కి వ్యతిరేకంగా పోస్టర్లు కూడా అంటించారు.
Governor Ravi: తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లో గవర్నర్ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య పోరు జరుగుతోంది. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి (RN Ravi) 10 బిల్లులను తిప్పి పంపడం వివాదాస్పదమైంది. గవర్నర్ రవి, సీఎం స్టాలిన్ (CM Stalin) మధ్య గత కొంత కాలంగా వివాదం నడుస్తోంది. గవర్నర్ వైఖరిని డీఎంకే (DMK) తప్పుబడుతోంది. పార్టీ కార్యకర్తలు గవర్నర్‌కి వ్యతిరేకంగా పోస్టర్లు కూడా అంటించారు. బీజేపీ (BJP) నియమించిన గవర్నర్ ఉద్దేశపూర్వకంగానే ఈ బిల్లులను తిప్పి పంపుతున్నారని మండిపడుతున్నారు ఆ పార్టీ నేతలు.
HARISH RAO: చిదంబరం వల్లే తెలంగాణలో బలిదానాలు.. ఆయనకు చరిత్ర తెలియదు: మంత్రి హరీశ్ రావు
ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. బిల్లులను తిప్పి పంపిస్తూ కావాలనే జనం అభిష్టాన్ని గవర్నర్ దెబ్బతీస్తున్నారని డీఎంకే ఆరోపిస్తోంది. యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్లను నియమించే గవర్నర్ అధికారాన్ని ప్రశ్నించింది. గవర్నర్ రవి గతంలో నీట్ పరీక్ష మినహాయింపు బిల్లును కూడా వాపస్ చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఈ బిల్లును ఆమోదించాకే దాన్ని భారత రాష్ట్రపతికి పంపారు. ఆన్‌లైన్ గేమింగ్ నిషేధం కోరుతూ వచ్చిన బిల్లుపైనా ఇలాగే వ్యవహరించారు గవర్నర్ రవి. గవర్నర్ రవి బిల్లులను వాపస్ చేసిన కొన్ని గంటకే తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ఎం. అప్పావు ఈ శనివారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ బిల్లులను మరోసారి గవర్నర్‌కి తిప్పిపంపాలని స్టాలిన్ సర్కార్ భావిస్తోంది. రెండోసారి పంపితే గవర్నర్ తప్పనిసరిగా సంతకం చేయాల్సి ఉంటుంది.
ఈమధ్యే సుప్రీంకోర్టు ఆగ్రహం
పంజాబ్ గవర్నర్ భన్వరీ లాల్ పురోహిత్ వ్యవహార శైలిపై, అక్కడి ఆప్ ప్రభుత్వం సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించింది. గవర్నర్ పురోహిత్ (Governor Purohith) కీలక బిల్లులకు ఆమోదం తెలపడం లేదని సీఎం భగవంత్ మాన్ సర్కార్ పిటిషన్ ఫైల్ చేసింది. ఈ కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్లు నిప్పుతో చెలగాలమాడుతున్నారని మండిపడింది. ఈ సందర్భంగా తమిళనాడు వ్యవహారం కూడా సుప్రీం ముందుకు వచ్చింది. సుప్రీం కామెంట్స్ చేసి వారం రోజులు కాకముందే మళ్ళీ తమిళనాడు గవర్నర్ రవి బిల్లులు వెనక్కి పంపడం వివాదస్పదంగా మారింది.