Vijay Dalapathy : దళపతి విజయ్ పైకి చెప్పు..!
తమిళంలో ఇళయ దళపతి విజయ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు వారం రోజుల ముందు నుంచే థియేటర్స్ దగ్గర అభిమానుల హంగామా స్టార్ట్ అవుతుంది. అలాగే ఆయన చిటికేస్తే కొన్ని లక్షల మంది అభిమానులు ఆయన ఏం చెప్తే అది చెయ్యడానికి రెడీ గా ఉంటారు. అలాంటి విజయ్ కి తాజాగా జరిగిన ఒక అవమానం ఇండియా మొత్తాన్ని షాక్ కి గురి చేస్తుంది.

Tamil star hero Vijay Dalapathy was slapped by an unidentified man
తమిళంలో ఇళయ దళపతి విజయ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు వారం రోజుల ముందు నుంచే థియేటర్స్ దగ్గర అభిమానుల హంగామా స్టార్ట్ అవుతుంది. అలాగే ఆయన చిటికేస్తే కొన్ని లక్షల మంది అభిమానులు ఆయన ఏం చెప్తే అది చెయ్యడానికి రెడీ గా ఉంటారు. అలాంటి విజయ్ కి తాజాగా జరిగిన ఒక అవమానం ఇండియా మొత్తాన్ని షాక్ కి గురి చేస్తుంది.
ఇటీవల ప్రముఖ నటుడు, దేశీయ మురుపోక్కు ద్రావిడ ఖజగం డిఏండికే పార్టీ అధ్యక్షుడు విజయ్ కాంత్ అనారోగ్య కారణాలతో మరణించారు. ఈ మేరకు విజయ్ కాంత్ పార్థివ దేహాన్ని చూడటానికి విజయ్ వెళ్ళాడు. విజయ్ కాంత్ భౌతిక దేహానికి నివాళులు అర్పిస్తున్న సమయంలో విజయ్ మీదకి గుర్తుతెలియని వ్యక్తి చెప్పు విసిరాడు. ఆ చెప్పు విజయ్ మెడ కి తగిలి కింద పడింది. దాంతో ఒక్కసారిగా అక్కడ ఒక్కసారిగా గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లో కి వస్తున్నాడన్న వార్తల నేపథ్యంలో విజయ్ కి జరిగిన అవమానం తమిళ రాష్ట్రాన్ని ఒక కుదుపు కుదుపుతుంది.
విజయ్ కి విజయ్ కాంత్ చాలా కావలసిన వ్యక్తి. ఎందుకంటే విజయ్ నటించిన మొదటి చిత్రం ప్లాప్ అవ్వడంతో విజయ్ రెండవ చిత్రమైన సింధూర పండి మూవీలో విజయ్ కాంత్ ఒక ముఖ్యమైన పాత్ర పోషించి ఆ సినిమా ఘన విజయం సాధించడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. అలాగే సిందూర పండి సినిమాతోనే విజయ్ హీరోగా నిలదొక్కుకున్నాడు.కచ్చితంగా అజిత్ అభిమానే ఇలా చేశాడని కోలీవుడ్ ఇండస్ట్రీ టాక్. విజయ్ వచ్చిన సందర్భం ఏంటో కూడా చూడకుండా ఇలా చెప్పుడు విసరడం ఏంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్ వార్ ఏమైనా ఉంటే తర్వాత చూసుకోండి. అయినా హీరోలు హీరోలు బాగానే ఉంటారు. ఇలాంటి పనులు చేయడం వల్ల ఫ్యాన్సే పోలీసులకు చిక్కుతున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు.