Telangana Governor : లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై తమిళిసై క్లారిటీ..
తెలంగాణ గవర్నర్ తమిళిసై ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు అంటూ కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై ఆమె క్లారిటీ ఇచ్చారు. ఓ మీటింగ్‌లో ఈ వ్యాఖ్యలపై తమిళిసై స్పందించారు. తాను ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. గవర్నర్ గా తన విధిలో భాగంగానే ప్రధానిని కలిశాను తప్ప.. ఎన్నికల అంశం ప్రస్తావనకు రాలేదంటు చెప్పారు. ప్రస్తుతానికి ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలో తాను లేనంటూ క్లారిటీ ఇచ్చారు.

Tamilisai Clarity on Lok Sabha Election Contest..
తెలంగాణ గవర్నర్ తమిళిసై ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు అంటూ కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై ఆమె క్లారిటీ ఇచ్చారు. ఓ మీటింగ్‌లో ఈ వ్యాఖ్యలపై తమిళిసై స్పందించారు. తాను ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. గవర్నర్ గా తన విధిలో భాగంగానే ప్రధానిని కలిశాను తప్ప.. ఎన్నికల అంశం ప్రస్తావనకు రాలేదంటు చెప్పారు. ప్రస్తుతానికి ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలో తాను లేనంటూ క్లారిటీ ఇచ్చారు. ఎంపీగా పోటీ చేస్తానంటూ హై కమాండ్‌ను తాను కోరలేదని చెప్పారు తమిళిసై. దీంతో ఆమె ఎంపీగా పోటీ చేస్తున్నారు అనే వార్తలకు చెక్ పడింది. కొన్ని రోజుల నుంచి ఈ విషయంలో రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడిచింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తమిళిసై ఎంపీగా పోటీ చేయబోతున్నారంటూ పెద్ద చర్చ జరిగింది.
తమిళనాడు నుంచి ఆమె ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారంటూ కూడా మాట్లాడుకున్నారు. ఈ విషయం మాట్లాడేందుకే ఆమె ప్రధానిని కలిశారని టాక్ వచ్చింది. తెలంగాణకు తమిళిసై గవర్నర్‌గా తెలుసు.. కానీ తమిళ ప్రజలకు మాత్రం ఆమె రాజకీయ నాయకురాలిగానే సుపరిచితురాలు. బీజేపీ ప్రభుత్వంలో తమిళిసై కీలక పాత్ర పోషించారు. దీంతో ఆమె ఎంపీగా పోటీ చేస్తున్నారు అనే వార్తలకు బలం చేకూరింది. హై కమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా చేయబోతున్నారంటే ఒకటే చర్చ. వీటన్నికీ ఇప్పుడు తమిళిసై క్లారిటీ ఇచ్చారు. హై కమాండ్ నిర్ణయానికే కట్టుబడి ఉంటారని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో తాను ఆసక్తిగ లేనంటూ క్లారిటీ ఇచ్చారు.