తమీమ్ ఇక్బాల్ రిటైర్మెంట్, అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై
బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 17 ఏళ్ళ పాటు బంగ్లాదేశ్ కు ప్రాతినిధ్యం వహించిన తమీమ్ సోషల్ మీడియా ద్వారా తన నిర్ణయాన్ని వెల్లడించాడు.
బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 17 ఏళ్ళ పాటు బంగ్లాదేశ్ కు ప్రాతినిధ్యం వహించిన తమీమ్ సోషల్ మీడియా ద్వారా తన నిర్ణయాన్ని వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అధ్యాయాన్ని ముగించాననీ, చాలా కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న తాను మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడం కష్టమంటూ రాసుకొచ్చాడు. క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడం తమీమ్ కు ఇది రెండోసారి. అంతకుముందు 2023లో క్రికెట్ కు వీడ్కోలు తెలిపాడు. అయితే బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా క్రికెట్ ఆడాల్సిందిగా కోరడంతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. 2007లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఇక్బాల్ బంగ్లాదేశ్ తరఫున 70 టెస్టులు, 243 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. కెరీర్ లో 25 సెంచరీలు, 94 హాఫ్ సెంచరీలతో అంతర్జాతీయ క్రికెట్‌లో 15 వేలకు పైగా రన్స్ చేశాడు