Tammineni Veerabhadram: తమ్మినేని వీరభద్రంకు గుండెపోటు.. హైదరాబాద్‌లో చికిత్స

ఖమ్మం జిల్లాలోని తన స్వగ్రామం తెల్ధారపల్లిలో తమ్మినేని అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంతో ఆయన ఇబ్బంది పడటంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఖమ్మంలోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడే డాక్టర్లు ఆయనకు ప్రాథమిక చికిత్స చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 16, 2024 | 04:15 PMLast Updated on: Jan 16, 2024 | 4:54 PM

Tammineni Veerabhadram Suffers Heart Attack Shifted To Hyderabad Hospital

Tammineni Veerabhadram: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం గుండెపోటుకు గురయ్యారు. ఖమ్మం జిల్లాలోని తన స్వగ్రామం తెల్ధారపల్లిలో తమ్మినేని అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంతో ఆయన ఇబ్బంది పడటంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఖమ్మంలోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడే డాక్టర్లు ఆయనకు ప్రాథమిక చికిత్స చేశారు. కానీ తమ్మినేని లంగ్స్‌లో ఇన్ఫెక్షన్‌ ఉండటంతో పాటు మైల్డ్‌ హార్ట్‌ ఎటాక్‌ లక్షణాలు కూడా ఉండటంతో వెంటనే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించాలంటూ డాక్టర్లు సూచించారు.

Chandrababu Naidu: అంబటి పంచ్‌.. చంద్రబాబు పిటిషన్‌పై అంబటి ఆసక్తికర ట్వీట్‌

దీంతో వాళ్ల సలహా మేరకు వెంటనే తమ్మినేనిని హైదరాబాద్‌కు తరలించారు. అయితే గతంలోనూ తమ్మినేనికి హార్ట్‌ ఎటాక్‌ హిస్టరీ ఉండటంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఓ సారి హార్ట్‌ ఎటాక్‌ రావడంతో ఆపరేషన్‌ చేసి స్టంట్‌ కూడా వేశారు డాక్టర్లు. ఇప్పుడు మరోసారి ఆయన హార్ట్‌ ఎటాక్‌కు గురవ్వడంతో ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే డాక్టర్లు మాత్రం ఆయన అరోగ్య విషయంలో భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ప్రస్తుతానికి ఆయనకు మెరుగైన చికిత్స అందిస్తున్నామంటూ చెప్పారు. వయసు ఎక్కువగా ఉన్న కారణంగా ఆయన ఇన్ఫెక్షన్‌ను తట్టుకోలేకపోయారని చెప్తున్నారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని.. త్వరలోనే ఇంటికి కూడా పంపిచేస్తామని చెప్తున్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న తమ్మినేని వీరభద్రం రీసెంట్‌గా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి ఆయన పొంగులేటికి వ్యతిరేకంగా పోటీ చేశారు. అయితే.. తమ్మినేనికి కేవలం 5 వేల 308 ఓట్లే వచ్చాయి. దీంతో ఆ‍యన మూడో స్థానంలో నిలిచారు.