TAPPING CASE : ఇజ్రాయెల్ పరికరాలతో ట్యాపింగ్.. 500 కోట్లకు పైగా వసూల్

పేరుకు పోలీస్ నిఘా... ఫోన్లు ట్యాపింగ్ చేయడం... బెదిరించడం... బ్లాక్ మెయిల్ చేసి... డబ్బులు వసూల్ చేయడం. ఇది BRS ప్రభుత్వ హయాంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దందా. BRS కీలకనేత చెప్పినట్టే ప్రతిపక్ష నేతలపై నిఘా పేరుతో మొదలైన ట్యాపింగ్ వ్యవహారం బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించే దాకా వెళ్ళింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 23, 2024 | 02:02 PMLast Updated on: Mar 23, 2024 | 2:02 PM

Tapping With Israeli Equipment More Than 500 Crores Collected

 

 

 

పేరుకు పోలీస్ నిఘా… ఫోన్లు ట్యాపింగ్ చేయడం… బెదిరించడం… బ్లాక్ మెయిల్ చేసి… డబ్బులు వసూల్ చేయడం. ఇది BRS ప్రభుత్వ హయాంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దందా. BRS కీలకనేత చెప్పినట్టే ప్రతిపక్ష నేతలపై నిఘా పేరుతో మొదలైన ట్యాపింగ్ వ్యవహారం బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించే దాకా వెళ్ళింది. అప్పటి SIB చీఫ్ ప్రభాకర్ రావు హయాంలో జరిగిన అకృత్యాలను పోలీసులు బయటకు తీస్తున్నారు. మాజీ DSP ప్రణీత్ రావు కస్టడీలో అనేక సంచలనాలు వెలుగుచూశాయి.

BRS హయాంలో నిఘా పేరుతో పోలీసులు అక్రమంగా వందల కోట్లు సంపాదించుకున్నారు. SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు… కొందరు పోలీస్ అధికారులతో ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది. చట్ట వ్యతిరేక పనులు చేస్తూ… దానికి పోలీస్ నిఘా అనే ముసుగు తొడిగారు. ఈ స్పై టీమ్ లో పోలీస్ అధికారులు రాధాకిషన్ రావు, తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్ రావు తోపాటు మరో నలుగురు పోలీసులు కూడా ఉన్నారు. రేవంత్ రెడ్డి సహా ప్రతిపక్ష నేతల ఫోన్లను నిఘా పెట్టే నెపంతో… 30 మంది వ్యాపారుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారు. అక్రమంగా ఫోన్లు ట్యాప్ చేసి… వ్యాపారులను బ్లాక్ మెయిల్ చేసి… వాళ్ళ నుంచి భారీగా డబ్బులు వసూల్ చేసినట్టు తెలుస్తోంది. SIB ఆధ్వర్యంలోని ఈ టీమ్ దాదాపు ఐదారొందల కోట్ల రూపాయలను వ్యాపారులనుంచి వసూల్ చేసినట్టు సమాచారం.

ప్రతిపక్ష నేతలపై నిఘా పెట్టడానికి 2018లో ఇజ్రాయెల్ నుంచి తెప్పించిన లేటెస్ట్ టెక్నాలజీ ఎక్విప్ మెంట్స్ పైనా కాంట్రోవర్సీ నడుస్తోంది. ప్రభాకర్ రావు అండ్ టీమ్… ఎంతో ఖరీదైన ఈ పరికరాలను ఎలా దిగుమతి చేసుకుంది. కేంద్ర ప్రభుత్వానికి సమాచారం లేకుండా ఎలా తెచ్చారు. అప్పటి BRS ప్రభుత్వంలో ఎవరు అనుమతిచ్చారు. అసలు వాటికి ఫండ్స్ ఎవరు మంజూరు చేశారు అన్నదానిపై స్పష్టత లేదు. ఉగ్రవాదులు, మావోయిస్టులపై నిఘా కోసం తెప్పించే పరికరాలైనా సరే… కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇవ్వాలి. అలా కాకుండా దొంగతనంగా ఈ ఫోన్ ట్యాపింగ్ పరికరాలను ఇజ్రాయెల్ నుంచి తెప్పించినట్టు తెలుస్తోంది.

కేసు విచారణలో భాగంగా… మాజీ అధికారుల ఇళ్ళల్లో పోలీసులు సోదాలు చేశారు. ఒకేసారి 10 చోట్ల పోలీసుల సోదాలు కొనసాగాయి. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇల్లు సహా… రాధాకిషన్, తిరుపతన్న భుజంగరావు ఇళ్ళల్లో సెర్చింగ్ జరిగింది. ఇప్పటికే ప్రభాకర్ రావు, రాధాకిషన్ ఇళ్ళు వదిలి వెళ్ళిపోయారు. ఎన్నికల రిజల్ట్స్ వచ్చాక OSD పదవికి ప్రభాకర్ రావు రిజైన్ చేశారు. ఆ తర్వాత ఆయన అమెరికా వెళ్ళినట్టు పోలీసుల అనుమానిస్తున్నారు.