ALEKHYA REDDY: విజయసాయికి విషెస్ట్ చెప్పిన తారకరత్న భార్య.. ఎమోషనల్ చేస్తున్న అలేఖ్య పోస్ట్..
టీడీపీ, వైసీపీ మధ్య నువ్వానేనా అన్నట్లు యుద్ధం జరుగుతున్న వేళ.. అలేఖ్యా రెడ్డి ఎవరి వైపు ఉంటారు.. ఎవరికి మద్దతిస్తారు అనే చర్చ జోరుగా సాగింది. ఐతే అలేఖ్యా రెడ్డి ఇన్‌స్టా పోస్ట్ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.

ALEKHYA REDDY: ఏపీలో ఎన్నికల వేళ.. దివంగత తారకరత్న భార్య అలేఖ్యా ఎటు వైపు అంటూ కొద్దిరోజులుగా చర్చ జరుగుతోంది. దీనికి పెద్ద కారణమే ఉంది. అలేఖ్యారెడ్డి భర్త తారకరత్నది నందమూరి వంశం.. పైగా టీడీపీ కుటుంబం. ఇక పర్సనల్‌గా అలేఖ్యా రెడ్డి వైసీపీ ఎంపీ విజయసాయికి కూతురు వరుస అవుతుంది. ఇప్పటివరకు రాజ్యసభ ఎంపీగా ఉన్న విజయసాయి.. నెల్లూరు నుంచి లోక్‌సభ బరిలో కనిపిస్తున్నారు.
YS JAGAN: అవినాష్ తప్పు చేయలేదన్న జగన్.. చెల్లెళ్ల ఫైర్
టీడీపీ, వైసీపీ మధ్య నువ్వానేనా అన్నట్లు యుద్ధం జరుగుతున్న వేళ.. అలేఖ్యా రెడ్డి ఎవరి వైపు ఉంటారు.. ఎవరికి మద్దతిస్తారు అనే చర్చ జోరుగా సాగింది. ఐతే అలేఖ్యా రెడ్డి ఇన్‌స్టా పోస్ట్ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. విజయసాయిరెడ్డితో, ఆయన కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ.. ఎన్నికల్లో ఆల్ ది బెస్ట్ అంటూ.. అలేఖ్యా రాసుకొచ్చిన పదాలు.. ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయ్. విజయసాయిని.. బుజ్జిబాబు అని పిలుస్తుంటారు అలేఖ్య. ఆల్ ది బెస్ట్ బుజ్జిబాబు అంటూ.. అలేఖ్యా చేసిన పోస్ట్ ఇప్పుడు ప్రతీ ఒక్కరిని ఎమోషనల్ చేస్తోంది. స్కూల్ నుంచి పికప్ చేసుకోవడం.. కలిసి బైక్ రైడింగ్ చేయడం.. ఇంకా అన్నీ అలా తిరుగుతున్నాయని.. మీద మీద ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి మాటలు చాలవంటూ.. విజయసాయి గురించి చెప్తూ అలేఖ్యా రెడ్డి పోస్ట్ పెట్టింది.
నేహాతో పాటు తనను కూడా సొంత కూతురిలా చూసుకున్నారని.. ఈ ప్రేమ ఎప్పటికీ గుర్తుంటుంది అంటూ అలేఖ్య రాసిన పదాలు.. మనసులను కదిలిస్తున్నాయ్. ఇక తన పిల్లలకు విజయసాయి మాస్క్ వేయించిన ఫొటోను కూడా ఆ వీడియోలా యాడ్ చేసింది. వచ్చే ఎన్నికల్లో అంతా మంచే జరగాలని.. మనస్ఫూర్తిగా కోరుకుంటాన్నాని అంటూ.. విజయసాయిరెడ్డి నామినేషన్ వేసిన ఫొటోను కూడా జతచేశారు అలేఖ్యా రెడ్డి. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజకీయాల సంగతి ఎలా ఉన్నా.. మంచి ఫ్యామిలీ అంటూ.. కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.