TDP Janasena Manifesto: టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల.. మెగా డీఎస్సీపైనే తొలి సంతకం!
మెగా డీఎస్సీ పైనే తొలి సంతకం పెడతానని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అలాగే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి హామీలిచ్చారు. అలాగే.. ఇటీవల జనాల్ని భయపెడుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తామని కూడా ప్రకటించారు.
TDP Janasena Manifesto: టీడీపీ, జనసేన ఆధ్వర్యంలోని ఉమ్మడి మేనిఫెస్టో విడుదలైంది. విజయవాడలో మంగళవారం మధ్యాహ్నం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ తరఫున సిద్ధార్థ సింగ్ హాజరుకాగా.. పురందేశ్వరి గైర్హాజరయ్యారు. మెగా డీఎస్సీ పైనే తొలి సంతకం పెడతానని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అలాగే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి హామీలిచ్చారు. అలాగే.. ఇటీవల జనాల్ని భయపెడుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తామని కూడా ప్రకటించారు.
T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌కు జట్టు ఎంపిక.. హార్దిక్‌కు చోటు..!
మొత్తంగా టీడీపీ గతంలో ప్రకటించిన సూపర్ 6, జనసేన షణ్ముఖ వ్యూహం అంశాల మేళవింపుగా మేనిఫెస్టో రూపొందింది. యువగళం ద్వారా టీడీపీకి వచ్చిన విజ్ఞప్తులు, జనవాణి ద్వారా జనసేనకు వచ్చిన విజ్ఞప్తుల ఆధారంగా మేనిఫెస్టో రూపొందించినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. 2047 నాటికి భారతదేశాన్ని సూపర్ పవర్ గా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తామన్నారు. జనసేన షణ్ముఖ వ్యూహంలోని హామీలివి. ఇంటింటికీ రక్షిత మంచినీరు కల్పించడం. స్కిల్ సెన్సస్, దేశంలోనే తొలిసారిగా నైపుణ్య గణన, స్టార్టప్ సంస్థలకు 10 లక్షల ఆర్థిక ప్రోత్సాహకం, EWS రిజర్వేషన్లు, ప్రజా రాజధానిగా అమరావతి పునర్నిర్మాణం.
మేనిఫెస్టోలోని కొన్ని కీలకాంశాలివి.
♦ ప్రతీ ఒక్కరికీ రూ.25 లక్షల హెల్త్ ఇన్స్యూరెన్స్. ♦ నాసిరకం మద్యం రద్దు.. ధరలు తగ్గింపు
♦ వికలాంగులకు రూ.6 వేల పెన్షన్, పూర్తిగా అంగవైకల్యం ఉన్నవారికి రూ.15 వేలు పెన్షన్
♦ పేదలకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల భూమి, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు భూమి కేటాయింపు
♦ వృద్ధులకు రూ.4 వేల పెన్షన్ ♦ పోలవరం పూర్తి చేయడం.. నదుల అనుసంధానం
♦ ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన ♦ చిన్న వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు
♦ సముద్ర వేట విరామ సమయంలో మత్స్యకారులకు 20 వేల ఆర్థిక సాయం
♦ 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతీ మహిళకు ప్రతీ నెలా రూ.1,500 ఆర్థిక సాయం
♦ మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్ ప్రయాణం, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు
♦ అధికారంలోకి రాగానే DSC నోటిఫికేషన్.. నిరుద్యోగ యువతకు 3 వేల నిరుద్యోగ భృతి
♦ BC డిక్లరేషన్ అమలు.. రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక పాలసీ.. క్రీడలకు ప్రోత్సాహం..
♦ మీడియా వారందరికీ అక్రిడేషన్ కార్డులు, ఉచిత నివాసం.. వాలంటీర్లకు రూ.10వేల గౌరవ వేతనం
♦ వక్ఫ్ బోర్డు తరహాలో హిందూ దేవాలయాల ఆస్తుల పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టం
♦ రైతులకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం.. ఆక్వారైతులకు రూ.1.50కే యూనిట్ విద్యుత్
♦ కాపు సంక్షేమం కోసం రూ.15వేల కోట్లు కేటాయింపు.. ప్రతి మండలంలో జనరిక్ మందుల దుకాణాలు
♦ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు.. విజయవాడలో హజ్ హౌస్ నిర్మాణం.. అందరికీ డిజిటల్ హెల్త్‌కార్డులు
♦ ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల.. దోబీ ఘాట్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్..
♦ ఆలయాల్లో పనిచేసే నాయీబ్రాహ్మణులకు రూ.25వేల గౌరవ వేతనం
♦ ఇప్పటికే మంజూరు చేసిన స్థలాల్లో ఉచితంగా ఇండ్ల నిర్మాణం..
♦ ‘తల్లికి వందనం’ పథకం ద్వారా విద్యార్థులకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం.