TDP-JANASENA ALLIANCE: జగన్‌పై తగ్గేదే లే..! టీడీపీ, జనసేన ఉమ్మడి పోరాటం

చంద్రబాబు బెయిల్‌పై క్లారిటీ వచ్చాక ఏపీ అంతటా సభలు, సమావేశాలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. కోర్టుల్లో బెయిల్ సంగతి తేలితే.. ఉమ్మడి సభల్లో చంద్రబాబు, పవన్ కలసి పాల్గొంటారు. ప్రతి 15 రోజులకోసారి సమన్వయ కమిటీ సమావేశం జరుగుతుంది. వచ్చే మీటింగ్ జనసేన పార్టీ ఆఫీసులో నిర్వహిస్తారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 9, 2023 | 04:18 PMLast Updated on: Nov 09, 2023 | 4:18 PM

Tdp Janasena Alliance Meeting Heled In Amaravathi

TDP-JANASENA ALLIANCE: ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే ఎన్నికల్లో సత్తా చాటేందుకు టీడీపీ, జనసేన రెడీ అవుతున్నాయి. ఇకపై ఏపీ సీఎం జగన్‌కు, YSRCPకి వ్యతిరేకంగా కలసి పనిచేయబోతున్నాయి ఈ రెండు పార్టీలు. ఈ నేపథ్యంలో అమరావతిలో తెలుగుదేశం (TDP), జనసేన (JANASENA) సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. త్వరలో జిల్లాల వారీగా ఉమ్మడిగా సభలు పెట్టాలని నిర్ణయించారు. చంద్రబాబు బెయిల్‌పై క్లారిటీ వచ్చాక ఏపీ అంతటా సభలు, సమావేశాలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. కోర్టుల్లో బెయిల్ సంగతి తేలితే.. ఉమ్మడి సభల్లో చంద్రబాబు, పవన్ కలసి పాల్గొంటారు. ప్రతి 15 రోజులకోసారి సమన్వయ కమిటీ సమావేశం జరుగుతుంది.

REVANTH REDDY: కాంగ్రెస్ నేతలపైనే ఐటీ దాడులా..? బీఆర్ఎస్, బీజేపీ నేతలపై ఎందుకు జరగవు: రేవంత్ రెడ్డి

వచ్చే మీటింగ్ జనసేన పార్టీ ఆఫీసులో నిర్వహిస్తారు. 2024 ఏప్రిల్‌లో జరిగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేయాలని ఈ మీటింగ్‌లో డిసైడ్ చేశారు. ఉమ్మడి మేనిఫెస్టో ఎలా ఉండాలన్నదానిపై రెండు పార్టీల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 13న ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ సమావేశం కూడా జరగనుంది. టీడీపీ, జనసేన మధ్య రాష్ట్రస్థాయిలో అలయెన్స్ కుదిరినా.. నియోజకవర్గ స్థాయిలో నేతలు, కార్యకర్తలు కలసి పనిచేస్తారా అన్నది డౌట్. అందుకే కింది కేడర్ మధ్య సన్నిహిత సంబంధాలు పెంచేందుకు నియోజకవర్గ స్థాయిలో ఆత్మీయ సమావేశాలు పెట్టాలని నిర్ణయించారు. ఈ నెల 14,15,16 తేదీల్లో ఈ ఆత్మీయ సమావేశాలను నిర్వహిస్తారు. ఏపీలో కరవు వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులు, రైతులకు కరవు సాయం, ఇన్‌పుట్ సబ్సిడీలు అందేలా ఉద్యమం చేపట్టాలని టీడీపీ, జనసేన సమన్వయ కమిటీలో నిర్ణయించారు. ఇకపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమాలన్నీ రెండు పార్టీలు కలిసే చేస్తాయి.

BRS, KTR : బీఆర్ఎస్ ప్రచారంలో అపశృతి.. ప్రచార వాహనం నుంచి కింద పడ్డ మంత్రి కేటీఆర్..

ఆంధ్రప్రదేశ్‌లో అధ్వానంగా ఉన్న రోడ్లపై వచ్చే శుక్ర, శనివారాల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి పోరాటం చేయబోతున్నాయి. బీసీ సమస్యలు, బీసీలపై దాడులకు సంబంధించి రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తారు. యువత, నిరుద్యోగ సమస్యలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని ఈ మీటింగ్‌లో నిర్ణయించారు. ఇక ముందు గవర్నమెంట్‌కు ఎలాంటి రిప్రజెంటేషన్ ఇచ్చినా టీడీపీ, జనసేన కలిసే ఇవ్వాలని నిర్ణయించాయి.