TDP SECOND LIST: టీడీపీ రెండో జాబితా రెడీ.. సీనియర్లకు మళ్లీ షాక్ తప్పదా..?
గురువారం టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేయబోతున్నారు. ఈ లిస్ట్‌లో కొంతమంది ఎంపీ అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటించబోతున్నారు. మొదటి విడతలో భాగంగా.. టీడీపీ, జనసేన ఉమ్మడిగా 99 మందితో ఫస్ట్ లిస్టు రిలీజ్ చేశాయ్.
TDP SECOND LIST: ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలని ఫిక్స్ అయిన చంద్రబాబు.. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. జనసేన, బీజేపీతో పొత్తు కూడా పెట్టుకున్నారు. సీట్ల పంపకాలపై కూడా క్లారిటీ వచ్చేసింది. ఇక అటు ఎన్నికల బరిలో నిలపడం కోసం.. గెలుపు గుర్రాలను అన్వేషిస్తున్నారు. ఇప్పటికే జనసేనతో కలిసి 99 మందితో అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన చంద్రబాబు.. రెండో జాబితాను ప్రకటించేందుకు సిద్ధం అయ్యారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు.
Vada Pav: వడ పావ్‌కు ప్రపంచ గుర్తింపు.. బెస్ట్ శాండ్‌విచ్ జాబితాలో చోటు..!
గురువారం టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేయబోతున్నారు. ఈ లిస్ట్‌లో కొంతమంది ఎంపీ అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటించబోతున్నారు. మొదటి విడతలో భాగంగా.. టీడీపీ, జనసేన ఉమ్మడిగా 99 మందితో ఫస్ట్ లిస్టు రిలీజ్ చేశాయ్. అందులో 94 మంది టీడీపీ, ఐదుగురు జనసేన అభ్యర్థులు ఉన్నారు. ఐతే ఈసారి 50మంది అభ్యర్థులతో చంద్రబాబు రెండో జాబితా విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సీట్ల కేటాయింపులో.. టీడీపీకి 144 ఎమ్మెల్యే, 17 ఎంపీ సీట్లు.. జనసేనకు 21 ఎమ్మెల్యే, రెండు ఎంపీ సీట్లు, బీజేపీకి 10 అసెంబ్లీ, 6 ఎంపీ సీట్లు కేటాయించారు. ఐతే ఇప్పటికే 94మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన టీడీపీ.. ఇబ్బందులు లేని మరో 50 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని తెలుస్తోంది. తొలి జాబితాలో గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమా, గోరంట్ల బుచ్చయ్య చౌదరి సహా పలువురు సీనియర్ నేతల పేర్లు లేవు. మరి రెండో లిస్టులో అయినా వారి పేర్లు ఉంటాయా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. సీనియర్లు పోటీ చేయాలని భావిస్తున్న నియోజకవర్గాల్లో విభేదాలు పీక్స్‌లో ఉన్నాయ్.
మైలవరంలో దేవినేని, వసంత మధ్య రచ్చ జరుగుతుంటే.. రాజమండ్రి రూరల్ టికెట్ విషయంలో ఇంకా సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఈ స్థానాన్ని జనసేన కూడా కోరుతోంది. ఇక గంటాను నియోజకవర్గం మార్చాలని.. చంద్రబాబు భావిస్తున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య.. సెకండ్ లిస్ట్‌లో సీనియర్లకు చోటు దక్కుతుందా లేదంటే.. షాక్‌లు తప్పవా అనే చర్చ మొదలైంది.