TDP VS YSRCP: తిరుపతిలో ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు

ఇదే సమయంలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని కూడా నామినేషన్ వేసేందుకు ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. ఇద్దరూ పెద్ద ఎత్తున ర్యాలీతో, వేలాది మంది కార్యకర్తలతో అక్కడికి చేరుకున్నారు. అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు వెళ్లారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 25, 2024 | 03:48 PMLast Updated on: Apr 25, 2024 | 3:48 PM

Tdp Vs Ysrcp In Tirupathi At Nomination Of Chandragiri Mla Candidates

TDP VS YSRCP: తిరుపతిలో చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. గురువారం టీడీపీ, వైసీపీ అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు వెళ్లిన సమయంలో ఘర్షణ తలెత్తడంతో ఇరు పార్టీల వాళ్లు పరస్పర దాడులకు దిగారు. రెండు పార్టీలకు చెందిన నాయకలు ఒకేసారి నామినేషన్ వేసేందుకు రావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది.

KHAMMAM MP: ఖమ్మంలో సగం భూములు వాళ్లవే.. కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి బ్యాగ్రౌండ్‌ ఇదే

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తన తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి నామినేషన్ వేసేందుకు వెళ్లారు. ఇదే సమయంలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని కూడా నామినేషన్ వేసేందుకు ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. ఇద్దరూ పెద్ద ఎత్తున ర్యాలీతో, వేలాది మంది కార్యకర్తలతో అక్కడికి చేరుకున్నారు. అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో బయట ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై రాళ్ల దాడి జరిగిందంటూ వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలపై దాడులకు దిగారు. వెంటనే టీడీపీ కార్యకర్తలు వైసీపీ నేతలపై ప్రతి దాడులకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రెండు పార్టీల వాళ్లు ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. అయితే, పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. లాఠీచార్జి చేసి.. ఇరు వర్గాలను చెదరగొట్టారు. నామినేషన్ వేసి, నాయకులు వెళ్లిపోయేంతవరకు అక్కడ ఎవర్నీ ఉండనీయకుండా లాఠీలు ఝుళిపించారు.

దీంతో కొద్దిసేపటి తర్వాత పరిస్థితి సద్దుమణిగింది. కాగా.. చంద్రగిరి అభ్యర్థిగా ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. భాస్కర్ రెడ్డి ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నాడు. ఐదేళ్లుగా చంద్రగిరిలో రాజకీయం వేడెక్కింది. చెవరెడ్డి, పులివర్తి.. రాజకీయ ప్రత్యర్థులుగా కన్నా.. శతృవులుగా భావించడంతో అక్కడ నిత్యం ఉద్రిక్త పరిస్థితులే ఉన్నాయి.