ఆంధ్రప్రదేశ్ లో ఈ మధ్య కాలంలో అత్యాచార ఘటనలతో పాటుగా చిన్నారులపై అఘాయిత్యాలు కూడా పెరిగిపోతున్నాయి. ఓ వైపు ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తున్నా కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు. కఠిన చట్టాలు తీసుకోస్తున్నా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నా మృగాలు మాత్రం మారడం లేదు. తాజాగా కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఓ ఘటన చోటు చేసుకుంది. చిన్నారితో ఉపాధ్యాయుడు అసభ్యకర ప్రవర్తన సంచలనం అయింది. మూడవ తరగతి విద్యార్థిని చైత్రిక తొడపై ఉపాధ్యాయుడు కొరకడంతో బాలిక తల్లి తండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. కోడూరు మండలం నరసింహపురం ఎంపీపీ పాఠశాలలో ఘటన జరిగింది. వారం రోజుల నుంచి విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న టీచర్ వేణుగోపాల్ రావుపై కోడూరు పోలీస్ స్టేషన్ లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేసారు. ఫోక్క్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసారు.