India: అన్ని ఫార్మెట్ల క్రికెట్ లో ఇండియాదే అగ్రస్థానం
టీమిండియా నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మనమే కింగులమని ప్రూవ్ చేసింది. మూడు ఫార్మాట్లలోనూ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది టీమిండియా. ఆస్ట్రేలియాతో జరిగిన ఫస్ట్ వన్డేను ఐదు వికెట్ల తేడాతో గెల్చుకోవడంతో.. వన్డేల్లోనూ అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
టీమిండియా నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మనమే కింగులమని ప్రూవ్ చేసింది. మూడు ఫార్మాట్లలోనూ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది టీమిండియా. ఆస్ట్రేలియాతో జరిగిన ఫస్ట్ వన్డేను ఐదు వికెట్ల తేడాతో గెల్చుకోవడంతో.. వన్డేల్లోనూ అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
- వన్డేల్లో మనమే తోపులం.
- టెస్టుల్లోనూ మనమే కింగులం.
- టీ20ల్లోనూ మనదే టాప్ ర్యాంక్.
భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాతో నువ్వా నేనా అన్నట్లుగా జరిగిన ఫస్ట్ వన్డేలో సూపర్ విక్టరీ సాధించింది. వన్డేలో వికెట్ల తేడాతో గెల్చిన టీమిండియా అరుదైన రికార్డ్ సాధించింది. ఈ విజయంతో వన్డేల్లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మూడు ఫార్మాట్లలో అగ్రస్థానంలో నిలిచింది. వన్డే ర్యాంకింగ్స్‌లో 116 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా.. టెస్టుల్లో 118 పాయింట్లు.. టీ20ల్లో 264 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతోంది. వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా టాప్‌లో ఉండగా.. పాకిస్థాన్ 115 పాయింట్లు.. ఆస్ట్రేలియా 111 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.
మొహాలిలో జరిగిన ఫస్ట్ వన్డేలో ఆసిస్‌ను మట్టికరిపించింది టీమిండియా. ముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. నిర్ణీత 50 ఓవర్లలో 276 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీతో రాణించగా.. జోష్ ఇంగ్లీస్ 45, స్టీవ్ స్మిత్ 41 పరుగులు చేశారు. మహ్మద్ షమీ ఐదు వికెట్లు తీసి ఆసిస్‌ను కంగారుపెట్టాడు. కంగారూలు ఇచ్చిన 277 పరుగుల టఫ్ టార్గెట్‌ని భారత్ ఆవేశపడకుండా, పొరపాటు చేయకుండా ఛేదించింది. 48.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసింది. ఓపెనర్లు గైక్వాడ్, గిల్ ఆసిస్ బౌలర్లను ఆడుకున్నారు. 142 పరుగుల భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశారు. 71 పరుగులు చేసిన గైక్వాడ్ జంపా బౌలింగులో ఎల్‌బీగా వెనుదిరగగా.. ఆ తర్వాత వచ్చిన అయ్యర్ మూడు పరుగులే చేసి రన్నవుట్ అయ్యాడు. గిల్‌కు జత కలిసిన ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ రిపేర్ చేసేందుకు ట్రై చేశారు. అయితే.. కిషన్ 18 పరుగుల దగ్గర కమ్మిన్స్ బౌలింగులో క్యాచవుటయ్యాడు. 142 పరుగుల వరకు ఒక్క వికెట్ కూడా కోల్పోని టీమిండియా.. 185 పరుగులకు వచ్చేసరికి నాలుగు వికెట్లు చేజార్చుకుంది.
సెకండ్ డౌన్‌లో దిగిన కెప్టెన్ రాహుల్ నిలకడగా బ్యాటింగ్ చేస్తూ.. ఛాన్స్ దొరికినప్పుడల్లా బౌండరీలు బాదాడు. మిడిలార్డర్‌లో వచ్చిన మిస్టర్ త్రీ సిక్స్‌టీ సూర్యకుమార్ యాదవ్ రాహుల్ తో కలిసి స్కోర్ బోర్డుని ముందుకు పరిగెత్తించాడు. చెరో హాఫ్ సెంచరీతో జట్టుని గెలుపు వాకిట్లో నిలిపారు. 48 బంతుల్లో 50 పరుగుల చేసి మంచి ఊపు మీదున్న సూర్య కుమార్.. అబోట్ బౌలింగులో బౌండరీ దగ్గర దొరికిపోయాడు. సూర్య క్రీజులో ఉన్నంత సేపు దూకుడుగానే ఆడాడు. ఐదు బౌండరీలు, ఒక సిక్సర్‌తో చెలరేగి పోయి, జట్టు గెలుపును ఈజీ చేశాడు. అప్పటికే మూడు ఓవర్లలో జట్టుకు 12 పరుగులు మాత్రమే అవసరం. తర్వాత వచ్చిన రవీంద్ర జడేజాతో కలిసి రాహుల్ కూల్‌గా మ్యాచ్ గెలిపించాడు. మూడు వన్డేల సిరీస్‌లో ఇండియా 1-0 ఆధిక్యంతో ఉండగా.. రెండో మ్యాచ్ ఆదివారం ఇండోర్‌లో జరుగుతుంది.