సఫారీలతో టీ20 సిరీస్ స్కైని ఊరిస్తున్న రికార్డులు
భారత్, సౌతాఫ్రికా మధ్య నాలుగు టీ ట్వంటీల సిరీస్ శుక్రవారం నుంచి మొదలుకాబోతోంది. ఈ సిరీస్ కు ముందు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను పలు రికార్డులు ఊరిస్తున్నాయి.
భారత్, సౌతాఫ్రికా మధ్య నాలుగు టీ ట్వంటీల సిరీస్ శుక్రవారం నుంచి మొదలుకాబోతోంది. ఈ సిరీస్ కు ముందు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. మరో 107 పరుగులు చేస్తే భారత్-సౌతాఫ్రికా టీ20 మ్యాచుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలుస్తాడు. ఈ జాబితాలో సౌతాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ అగ్రస్థానంలో కొసాగుతున్నాడు. సౌతాఫ్రికాతో ఇప్పటి వరకు 7 టీ20 మ్యాచ్‌లు ఆడిన సూర్య 175.63 స్ట్రైక్‌రేట్‌తో 346 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో సూర్య మరో 6 సిక్స్‌లు బాదితే టీ20ల్లో 150 సిక్స్‌ల మైలురాయి అందుకుంటాడు. అత్యధిక సిక్సర్ల జాబితాలో రోహిత్ శర్మ, మార్టిన్ గప్టిల్ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్ , నికోలస్ పూరన్ 144 సిక్స్‌లతో మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు.