Shubhman Gill: బర్త్ డే విష్ బయటపెట్టాడు
శుభ్ మన్ గిల్ పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్న టీం ఇండియా.

Team India celebrated Subhaman Gill's cake Cutting birthday in a grand manner
టీమిండియా యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 24వ ఏట అడుగు పెట్టాడు. శుక్రవారం నాడు అతని బర్త్ డే వేడుకలను టీమిండియా జరుపుకుంది. సూపర్-4లో తమ తొలి మ్యాచ్‌లో టీమిండియా పాకిస్తాన్‌తో ఢీకొట్టనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం కొలంబో చేరుకున్న టీమిండియా.. వర్షం కారణంగా ఇండోర్ ప్రాక్టీస్ సెషన్స్ నిర్వహిస్తోంది. ఈ సమయంలోనే గిల్ బర్త్ డేను టీంమేట్స్ సెలబ్రేట్ చేశారు. ఈ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో చూపిస్తూ.. టీమిండియా ఎడం చేతి వాటం స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఒక వీడియోను నెట్టింట షేర్ చేశాడు. టీం క్యాంప్‌లో ఎంత అల్లరిగా బర్త్ డే జరిగిందో ఈ వీడియోలో కనిపించింది.
ఈ వీడియో తన టీంమేట్స్ అందరి ముందూ గిల్ కేక్ కట్ చేస్తూ కనిపించాడు. అలాగే మొఖం నిండా కేక్‌తో ఉన్న గిల్ ఫొటోను కూడా కుల్దీప్ యాదవ్ షేర్ చేశాడు. ‘హ్యాపీ బర్త్ డే మై బ్రో శుభ్‌మన్ గిల్’ అని ఈ వీడియోకి కుల్దీప్ క్యాప్షన్ పెట్టాడు. ఇది చూసిన ఫ్యాన్స్ కూడా ఈ ‘ప్రిన్స్’కు బర్త్ డే విషెస్ చెప్తున్నారు. భవిష్యత్తులో మరెన్నో రికార్డులు గిల్ బద్దలు కొడతాడని అంతా ఆశిస్తున్నారు. ఆసియా కప్ ప్రదర్శన దృష్ట్యా గిల్ బ్యాటింగ్‌లో కొన్ని టెక్నికల్ లోపాలు ఉన్నాయని, వాటిని సరి చేసుకుంటే అతను మళ్లీ చెలరేగుతాడని గంభీర్, ఇర్ఫాన్ పఠాన్ తదితరులు సలహా ఇస్తున్నారు. మరి గిల్ ఏం చేస్తాడో చూడాలి.