కుర్రాళ్ళూ కుమ్మేయండి సఫారీలతో తొలి టీ ట్వంటీ

ఒకవైపు ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ కోసం సీనియర్లు సన్నద్ధమవుతుంటే... మరోవైపు యువ ఆటగాళ్ళతో కూడిన యంగ్ ఇండియా సఫారీ గడ్డపై టీట్వంటీ సిరీస్ కు రెడీ అయింది. సౌతాఫ్రికాతో నాలుగు టీ ట్వంటీల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ శుక్రవారం జరగబోతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 8, 2024 | 12:56 PMLast Updated on: Nov 08, 2024 | 12:56 PM

Team India First Match South Africa

ఒకవైపు ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ కోసం సీనియర్లు సన్నద్ధమవుతుంటే… మరోవైపు యువ ఆటగాళ్ళతో కూడిన యంగ్ ఇండియా సఫారీ గడ్డపై టీట్వంటీ సిరీస్ కు రెడీ అయింది. సౌతాఫ్రికాతో నాలుగు టీ ట్వంటీల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ శుక్రవారం జరగబోతోంది. ఈ మ్యాచ్ కు డర్బన్ ఆతిథ్యమిస్తోంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో బరిలోకి దిగుతున్న యువ ఆటగాళ్ళకు ఈ సిరీస్ మంచి అవకాశంగా చెప్పొచ్చు. ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఫ్రాంచైజీలు దృష్టిలో పడేందుకు ఇంతకంటే మంచి ఛాన్స్ లేదనే చెప్పాలి. అలాగే 2026 టీ ట్వంటీ వరల్డ్ కప్ కోర్ టీమ్ ను రెడీ చేసుకునేందుకు కూడా టీమ్ మేనేజ్ మెంట్ కు ఇది మంచి అవకాశమే.
టీ2 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత విదేశాల్లో భారత జట్టు తలపడుతోన్న తొలి టీ20 సిరీస్ ఇదే. వరల్డ్ కప్ ఫైనల్లో సఫారీలను ఓడించే ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచిన టీమ్ లో పలువురు ఆటగాళ్ళు ఈ జట్టులో ఉన్నారు. సఫారీ గడ్డపై సిరీస్ గెలవాలని ఎదురుచూస్తున్న కుర్రాళ్ళకు ఆతిథ్య జట్టు నుంచి గట్టి సవాలే ఎదురుకానుంది.

సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఈ సిరీస్ కు సంబంధించి పలువురు కుర్రాళ్ళ అంతర్జాతీయ అరంగేట్రం ఖాయంగా కనిపిస్తోంది. తొలిసారి జట్టులోకి వచ్చిన రమణ్ దీప్ సింగ్ , యశ్ దయాల్ తొలి మ్యాచ్ లో ఎంట్రీ ఇచ్చే ఛాన్సుంది. అలాగే బ్యాటింగ్ లో సంజూ శాంసన్, రింకూసింగ్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ వంటి యువ ఆటగాళ్ళపై అంచనాలున్నాయి. అటు ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా కూడా జట్టులో ఉండడం అడ్వాంటేజ్. బౌలింగ్ లో అర్షదీప్ సింగ్ పేస్ ఎటాక్ ను లీడ్ చేయనుండగా… అవేశ్ ఖాన్ , విజయకుమార్ వైశాఖ్ కూడా ఈ టూర్ కు ఎంపికయ్యారు. అటు స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ కీలకం కానున్నారు. భారత కాంబినేషన్ ఇద్దరు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లుతో పాటు ఆల్ రౌండర్లకే ప్రయారిటీ ఇవ్వనుంది.

మరోవైపు సొంతగడ్డపై ఆడుతుండటం సఫారీలకు కలిసొచ్చే అంశం. టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి రివేంజ్ తీర్చుకునేలా సిరీస్ ను ఘనంగా ఆరంభించాలని సఫారీలు పట్టుదలగా ఉన్నారు. కెప్టెన్ మక్ర్ రమ్ సారథ్యంలో డేవిడ్ మిల్లర్, క్లాసెన్ , హెండ్రిక్స్ , కేశవ్ మహారాజ్ మాత్రమే సీనియర్లుగా ఉన్నారు. మిగిలిన ఆటగాళ్ళందరూ ఇటీవలే జట్టులోకి వచ్చినవారు కావడంతో వారికి సవాల్ గా చెప్పొచ్చు. ఇక గత రికార్డుల్లో మాత్రం టీమిండియాదే పైచేయిగా ఉంది. ప్పటివరకూ ఈ ఇరు జట్లు 27 సార్లు టీ20ల్లో తలపడగా.. భారత్ 15 మ్యాచ్ లలో గెలిచింది. దక్షిణాఫ్రికా 11 సార్లు విజయం సాధించగా..ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. అటు మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న డర్బన్ లోనూ భారత్ కు అద్భుతమైన రికార్డుంది. కాగా డర్బన్ పిచ్ బ్యాటర్లకు అనుకూలించే అవకాశమున్నట్టు అంచనా. మొత్తం మీద ఇరు జట్లలోనూ యువ ఆటగాళ్ళే ఎక్కువగా ఉండడంతో టీ ట్వంటీ మజా ఖాయమని చెప్పొచ్చు.