నితీశ్ , అభిమన్యుకు పిలుపు ఆసీస్ టూర్ కు భారత జట్టు ఇదే
మూడోసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలవాలనుకుంటున్న భారత్ ఆస్ట్రేలియా టూర్ కోసం స్ట్రాంగ్ టీమ్ నే ఎంపిక చేసింది. బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఆస్ట్రేలియా పర్యటనకు 18 మందితో కూడిన జట్టుని ప్రకటించింది.టెస్ట్ జట్టులో తొలిసారి విశాఖపట్నం కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి చోటు దక్కింది.
మూడోసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలవాలనుకుంటున్న భారత్ ఆస్ట్రేలియా టూర్ కోసం స్ట్రాంగ్ టీమ్ నే ఎంపిక చేసింది. బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఆస్ట్రేలియా పర్యటనకు 18 మందితో కూడిన జట్టుని ప్రకటించింది.టెస్ట్ జట్టులో తొలిసారి విశాఖపట్నం కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి చోటు దక్కింది. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆల్‌రౌండర్ ప్రదర్శనతో నితీశ్ కుమార్ అదరగొట్టేశాడు. పేస్ ఆల్ రౌండర్ గా అతనిపై ఫోకస్ పెట్టిన గంభీర్ ఆసీస్ టూర్ కు ఎంపిక చేయించాడు. దీని కంటే ముందు ఆసీస్ ఏ జట్టుతో జరిగే సిరీస్ కు భారత్ ఏ జట్టులో కూడా నితీష్ రెడ్డి చోటు దక్కించుకున్నాడు. గతంలో హార్దిక్ పాండ్యాకి ఈ అవకాశ దక్కగా.. ప్రస్తుతం అతను వన్డే, టీ20లకే పరిమితం అయిపోయాడు. దాంతో టెస్టుల్లో పేస్ ఆల్‌రౌండర్ కోసం టీమిండియా మేనేజ్‌మెంట్ ఇన్నాళ్లు ఎదురుచూసింది.
న్యూజిలాండ్ సిరేస్ లో జట్టుతో ఉన్న ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌కి ఈ టీమ్‌లో చోటు దక్కలేదు. కుల్దీప్ యాదవ్‌కి గాయమైనట్లు చెప్పుకొచ్చిన బీసీసీఐ.. అక్షర్ పటేల్‌ను తప్పించడానికి మాత్రం సరైన కారణం చెప్పలేదు. అక్షర్ స్థానంలో ప్రస్తుతం పుణె టెస్టులో అదరగొడుతున్న ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ను ఎంపిక చేసింది. అయితే గాయం కారణంగా మహ్మద్ షమీ ఈ జట్టులో లేకపోవడం భారత్ జట్టుకి ఇబ్బందికర పరిస్థితి. ఆస్ట్రేలియా పిచ్‌లపై మంచి అనుభవం ఉన్న షమీ లాంటి పేసర్ లేకపోవడంతో.. జస్‌ప్రీత్ బుమ్రాపై అదనపు భారం పడనుంది.
రోహిత్ శర్మ తొలి టెస్టుకి లేదా రెండో టెస్టుకి అందుబాటులో ఉండనని ఇప్పటికే బీసీసీఐకి సమాచారం అందించాడు. దాంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈశ్వరన్ అభిమన్యుని జట్టులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ మ్యాచ్‌లో ఆడకపోతే టీమ్ వైస్ కెప్టెన్‌గా ఉన్న ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా జట్టుని కెప్టెన్‌గా నడిపిస్తాడు.ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లగా ముకేష్ కుమార్, నవదీప్ సైనీ, ఖలీల్ అహ్మద్ ఎంపికయ్యారు. ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ జట్టు 5 టెస్టుల సిరీస్‌ను ఆడనుంది