ఐదు రోజులెందుకు ? దమ్ముంటే 2 రోజులు చాలు

టెస్ట్ మ్యాచ్ ఫలితం ఒక్కోసారి రెండు లేదా రెండున్నర రోజుల్లో వచ్చిన సందర్భాలున్నాయి... కానీ మొదటి రెండున్నర రోజుల్లోనే అలా మ్యాచ్ రిజల్ట్ వచ్చేవే ఎక్కువ.. ఇక ఫ్లాట్ వికెట్ అయితే డ్రాగా ముగిసిన మ్యాచ్ లే ఎక్కువగా కనిపిస్తాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 1, 2024 | 02:14 PMLast Updated on: Oct 01, 2024 | 2:14 PM

Team India Kanpur Test Latest Update

టెస్ట్ మ్యాచ్ ఫలితం ఒక్కోసారి రెండు లేదా రెండున్నర రోజుల్లో వచ్చిన సందర్భాలున్నాయి… కానీ మొదటి రెండున్నర రోజుల్లోనే అలా మ్యాచ్ రిజల్ట్ వచ్చేవే ఎక్కువ.. ఇక ఫ్లాట్ వికెట్ అయితే డ్రాగా ముగిసిన మ్యాచ్ లే ఎక్కువగా కనిపిస్తాయి. అయితే రెండున్నర రోజులు వర్షంతో ఆటే జరగకుండా… చివరి రెండు రోజుల్లో మ్యాచ్ గెలిస్తే ఆ కిక్కే వేరు.. ప్రస్తుతం టీమిండియా కాన్పూర్ లో అభిమానులకు ఇలాంటి కిక్కే ఇచ్చింది. వర్షం కారణంగా రెండురోజుల పాటు ఆటగాళ్ళు గ్రౌండ్ లోకే దిగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్ డ్రాగా ముగియడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ కోచ్ గంభీర్ మాత్రం అలా అనుకోలేదు. 2-0తో సిరీస్ గెలవడమే లక్ష్యంగా వ్యూహాన్ని రెడీ చేశాడు. పక్కా ప్లానింగ్ తో దానిని అమలు చేశాడు. ఫలితాన్ని అందుకున్నాడు.

ఇంగ్లాండ్ క్రికెట్ లో తరచూ వినిపిస్తున్నబజ్ బాల్ కాన్సెప్ట్ ను టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో ఫాలో అయ్యింది. బౌలర్లు తమ పని తాము పూర్తి చేస్తే… బ్యాటర్లు దుమ్మురేపారు. టెస్టుల్లో టీ ట్వంటీ బ్యాటింగ్ ను ఆడేశారు. 3 ఓవర్లలోనే 50, 10 ఓవర్లలోనే 100 , 25 ఓవర్లలోనే 200 … ఇదీ భారత్ బ్యాటింగ్ ఆడిన తీరు…బ్యాటింగ్ లో దూకుడుగా ఆడి 52 పరుగుల లీడ్ తో ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం ద్వారా భారత్ డేరింగ్ స్టెప్ వేసింది. తర్వాత మళ్ళీ బౌలర్లు తమ పనికానిచ్చేశారు. స్పిన్నర్లు తిప్పేస్తే చివర్లో బూమ్రా ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. 95 పరుగుల టార్గెట్ ను 3 వికెట్లు కోల్పోయి ఛేదించిన భారత్ 2-0తో సిరీస్ ను వైట్ వాష్ చేసింది. ఈ విజయం తర్వాత ఫ్యాన్స్ చెబుతున్నది ఒకటే మాట… టెస్ట్ మ్యాచ్ కు ఐదురోజులెందుకు… దమ్మున్న జట్టుకు రెండురోజులు చాలంటూ కామెంట్స్ చేస్తున్నారు