మెల్‌బోర్న్ కు టీమిండియా, ఇంటికి బయల్దేరిన అశ్విన్
టీమిండియా అనుభవజ్ఞుడైన ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ తన 38వ ఏట అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన గబ్బా టెస్టు అనంతరం అశ్విన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. అశ్విన్ రిటైర్మెంట్ వార్త తెలియగానే అందరి కళ్లు చెమ్మగిల్లాయి.
టీమిండియా అనుభవజ్ఞుడైన ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ తన 38వ ఏట అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన గబ్బా టెస్టు అనంతరం అశ్విన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. అశ్విన్ రిటైర్మెంట్ వార్త తెలియగానే అందరి కళ్లు చెమ్మగిల్లాయి. ముఖ్యంగా టీమిండియా సభ్యులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కోహ్లీ, రోహిత్ అశ్విన్ సేవలను గుర్తు చేసుకుని కంటతడిపెట్టారు. మిగతా సభ్యులు అశ్విన్ సీనియారిటీని గుర్తు చేసుకున్నారు. రిటైర్మెంట్ తర్వాత అశ్విన్ చివరిసారిగా డ్రెస్సింగ్ రూమ్‌కు చేరుకోగానే ఆటగాళ్లు, క్రీడా సిబ్బంది భావోద్వేగానికి గురైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అశ్విన్ డ్రెస్సింగ్ రూమ్‌లో భావోద్వేగ ప్రసంగం చేశాడు. అంతే కాకుండా డ్రెస్సింగ్ రూమ్‌కి చేరుకోగానే ఆస్ట్రేలియా ఆటగాళ్లు పాట్ కమిన్స్, నాథన్ లియోన్‌లు అతడికి ప్రత్యేక బహుమతిని అందించారు. ఆస్ట్రేలియన్ ప్లేయర్లు సైన్ చేసిన ఆసీస్ జర్సీని చూసి అశ్విన్ ఎమోషనలయ్యాడు. ఇకపోతే BGT సిరీస్లో ఇంకా కేవలం రెండు టెస్టులు మాత్రమే మిగిలి ఉన్నాయి. నాల్గవ టెస్ట్ ఐకానిక్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో డిసెంబర్ 26 నుండి ప్రారంభమవుతుంది. దీన్ని బాక్సింగ్ డే టెస్ట్ అని కూడా పిలుస్తారు. బ్రిస్బేన్‌లోని హోటల్ నుండి టీమ్ ఇండియా మెల్‌బోర్న్ కు బయలుదేరింది.దీనికి సంబందించిన ఫుటేజ్ ఒకటి బయటకొచ్చింది. మెల్‌బోర్న్ కు బయలుదేరేముందు టీమిండియా అశ్విన్ కు ఘనంగా వీడ్కోలు పలికింది. తర్వాత అశ్విన్ బ్రిస్బేన్ నుంచి స్వగ్రామానికి చేరుకున్నాడు.
మెల్‌బోర్న్ స్టేడియం భారత్ కు అచొచ్చిన స్టేడియంగా చెప్పుకుంటారు. ఈ పిచ్ పై భారత్ నాలుగు ప్రతిష్టాత్మకమైన విజయాలను అందుకుంది. తొలిసారి 1977 డిసెంబరులో టీమిండియా 22 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. అంతేకాదు ఇక్కడ గత మూడు మ్యాచ్ ల్లో భారత్ ఒక్క టెస్టులోనూ ఓడిపోలేదు. 2018-19 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మూడో టెస్టులో టీమిండియా 137 పరుగులతో ఆస్ట్రేలియాను చిత్తూ చేసింది. 2020లో కెప్టెన్ అజింక్యా రహానే సెంచరీతో భారత్ ఆస్ట్రేలియాను ఓడించింది.