స్టేడియం క్లోజ్ చేసి మరీ ప్రాక్టీస్, సీక్రేట్ ప్రాక్టీస్ వెనుక స్టోరీ ఇదే
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం టీమిండియా కసరత్తు మొదలైంది. ఈ సారి హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా కంగారూ గడ్డపై అడుగుపెట్టిన భారత్ దానికి తగ్గట్టుగానే పక్కా ప్లానింగ్ తో రెడీ అవుతోంది. అందరినీ ఆశ్చర్యపరుస్తూ సీక్రేట్ గా ప్రాక్టీస్ చేస్తోంది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం టీమిండియా కసరత్తు మొదలైంది. ఈ సారి హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా కంగారూ గడ్డపై అడుగుపెట్టిన భారత్ దానికి తగ్గట్టుగానే పక్కా ప్లానింగ్ తో రెడీ అవుతోంది. అందరినీ ఆశ్చర్యపరుస్తూ సీక్రేట్ గా ప్రాక్టీస్ చేస్తోంది. స్టేడియంలోకి ఎవ్వరినీ అనుమతించకుంటా భారత క్రికెటర్లు నెట్స్ లో బిజీగా గడుపుతున్నారు. ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ కు కూడా ఫ్యాన్స్ కు ఎంట్రీ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే లాక్ డౌన్ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో వార్మప్ మ్యాచ్‌తో పాటు ప్రాక్టీస్ సెషన్‌ని కూడా సీక్రెట్‌గా ఉంచాలని టీమిండియా నిర్ణయించింది. భారత్ ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలోకి ప్రేక్షకుల్ని అనుమతించడం లేదు. అలానే టీమిండియా వార్మప్ మ్యాచ్ వీడియోలను చిత్రీకరించడానికే కూడా ఎవరినీ అక్కడ అనుమతించడం లేదు.
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో తలపడబోయే భారత్ జట్టు ఒకవేళ అక్కడి ప్రేక్షకుల ముందు వార్మప్ మ్యాచ్ ఆడితే.. జట్టులోని బ్యాటర్ల బలహీనతలు కనిపించే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా జట్టులో యశస్వి జైశ్వాల్, సర్ఫరాజ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి లాంటి కొత్త ఆటగాళ్లు ఉన్నారు. వీరికి ఇదే తొలి ఆసీస్ పర్యటన. అలానే బౌలింగ్‌లోనూ ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా కూడా తొలిసారి ఆసీస్ టూర్ కు ఎంపికయ్యాడు. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా క్లోజ్డ్ స్టేడియంలోనే భారత ఆటగాళ్ళు కసరత్తు చేస్తున్నారు. ఒకవేళ భారత్ జట్టు ప్రాక్టీస్ మ్యాచ్ వీడియోలు ఆస్ట్రేలియాకి దొరికినా సిరీస్‌లో ఇబ్బందులు ఎదురవుతాయని టీమిండియా భావిస్తోంది.
మరోవైపు భారత్ సీక్రేట్ ప్రాక్టీస్ సెషన్స్ పై ఆసీస్ మీడియా సెటైర్లు వేస్తోంది. స్టేడియంలో లాక్‌డౌన్ వాతావరణం కనిపిస్తోందంటూ వార్తలు రాస్తోంది. ఇవేమీ పట్టించుకోని భారత క్రికెట్ జట్టు ప్రాక్టీస్ లో బిజీగా గడుపుతుండగా… ఆసీస్ ఆటగాళ్ళు కూడా ప్రాక్టీస్ షురూ చేశారు. 2016 నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియానే గెలుస్తోంది. గత రెండు పర్యాయాలు ఆసీస్ గడ్డపై భారత్ దే పైచేయిగా నిలిచింది. ఈ సారి ఎట్టిపరిస్థితుల్లోనూ రోహిత్ సేనకు సిరీస్ గెలిచే ఛాన్స్ ఇవ్వకూడదని పట్టుదలగా ఉన్న ఆసీస్ ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూడాలి. ఇటీవల న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ పరాభవం భారత్ కాన్ఫిడెన్స్ ను దెబ్బతీసింది. కానీ ఆస్ట్రేలియా పిచ్ లంటే రెచ్చిపోయే కోహ్లీ ఫామ్ లోకి వస్తే మాత్రం ఆపడం కంగారూలకు కష్టమే. కాగా భారత్, ఆస్ట్రేలియా మధ్య పెర్త్ వేదికగా నవంబరు 22 నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుండగా.. ఈ మ్యాచ్‌కి భారత కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండటం లేదు. దీంతో వైస్ కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా భారత్ జట్టుని నడిపించనున్నాడు. రోహిత్ స్థానంలో ఓపెనర్ గా కెఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్ లో ఒకరు జైశ్వాల్ తో కలిపి ఇన్నింగ్స్ ఆరంభించనున్నారు.