Chase Master Kohli : నేనింతే.. ఛేజ్ మాస్టర్ కోహ్లీ..
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఛేజింగ్‌లో తానే కింగ్ అని మరోసారి నిరూపించుకున్నాడు. ఆదివారం జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో అద్భుతమైన బ్యాటింగ్ అదరగొట్టాడు.

Team India's star batsman Virat Kohli once again proved that he is the king in the chase.
Chase Master Kohli టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఛేజింగ్‌లో తానే కింగ్ అని మరోసారి నిరూపించుకున్నాడు. ఆదివారం జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో అద్భుతమైన బ్యాటింగ్ అదరగొట్టాడు. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కేవలం 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. అలాంటి సమయంలో కేఎల్ రాహుల్‌తో కలిసి విరాట్ కోహ్లీ మరపురాని ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలోనే 75 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసిన కోహ్లీ 116 బంతుల్లో 85 రన్స్ చేసి అవుటయ్యాడు. ఇలా జట్టును ఆదుకున్న కోహ్లీ ఇన్నింగ్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కోహ్లీ మరోసారి తనను ఛేజ్ మాస్టర్ అని ఎందుకు అంటారో నిరూపించాడు అని అంటున్నాడు. పదేళ్లుగా టీమిండియాను కోహ్లీ కాపాడుతూనే ఉన్నాడని పొగిడేస్తున్నారు. ఏళ్లు గడిచినా ఈ పరిస్థితి మాత్రం మారలేదు అని అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.