తెలంగాణ అమర్నాథ్ యాత్ర షురూ.. A టు Z పూర్తి సమాచారం.. సలేశ్వర యాత్ర – అమర్ నాథ్ యాత్ర ప్రత్యేకతలు
తెలంగాణ అమర్‌నాథ్ యాత్రగా పేరొందిన సలేశ్వరం జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. చుట్టూ అడవి.. కొండలు.. కోనలు.. జలపాతాలు.. ప్రకృతి రమణీయతకు అద్దంపట్టే నల్లమల అటవీ ప్రాంతంలో దట్టమైన లోయ గుహలో వెలసిన లింగమయ్య దర్శమిస్తారు. ఈ నెల 24వ తేదీ వరకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే భక్తులను అడవిలోకి అనుమతించనున్నట్టు అధికారులు ప్రకటించారు.
తెలంగాణ అమర్నాథ్ యాత్ర.. ఏంటి షాక్ అవుతున్నారా.. అమర్ నాథ్ ఉండేది జమ్ముకశ్మీర్ లో కధా.. తెలంగాణ లో ఉంది అంటారేంటి అంటారా.. అయితే అక్కడికే వస్తున్న ఆగండి. ఉత్తర భారతదేశంలో హిమాలయ కొండల్లో జమ్ము కశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్ ఉన్న ఆలయంలో శివుడు మంచు శిల రూపంలో లింగం ఆకారంలో ఉంటుంది. ఇలానే దక్షిణ అమర్ నాథ్ గా పెరు పొందిన.. తెలంగాణ రాష్ట్రం ఓ అమర్ నాథ్ యాత్ర చేస్తుంటారు అని చాలా వరకు తెలియదు. 2014 తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయ్యకా.. తెలంగాణ అమర్నాథ్ యాత్ర కు చాలా ప్రాముఖ్యత తెచ్చారు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం.
తెలంగాణ అమర్ నాథ్ యాత్ర..
తెలంగాణ అమర్‌నాథ్ యాత్రగా పేరొందిన సలేశ్వరం జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. చుట్టూ అడవి.. కొండలు.. కోనలు.. జలపాతాలు.. ప్రకృతి రమణీయతకు అద్దంపట్టే నల్లమల అటవీ ప్రాంతంలో దట్టమైన లోయ గుహలో వెలసిన లింగమయ్య దర్శమిస్తారు. ఈ నెల 24వ తేదీ వరకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే భక్తులను అడవిలోకి అనుమతించనున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈ జాతర తెలంగాణ అమరనాథ్ యాత్రగా ప్రత్యేక గుర్తింపు పొందిందని, ఏటా మూడురోజులు మాత్రమే ఇక్కడ జాతర జరుగుతుందని తెలిపారు. భక్తులు కిలోమీటర్ల మేర కాలినడకన కొండలు, గుట్టలు దాటుకుంటూ సలేశ్వరం గుడివద్దకు సాహసయాత్ర చేయాల్సి ఉంటుంది.
ఇక విషయం లోకి వెళితే..
దక్షిణాది అమర్ నాథ యాత్రగా పేరుగాంచిన సలేశ్వరం లింగమయ్య.. నల్ల మల్ల అడవిలోని అక్కడి నివాస చెంచులకు కులదైవాంగా చెప్పుకుంటారు. ఎత్తైన కొండలు.. దట్టమైన నల్లమల అడవి మీదుగా లోతట్టు ప్రాంతంలో.. ప్రకృతి సహజసిద్ధ జలపాతాన్ని దాటుకుంటూ.. పున్నమి వెన్నెలలో చెంచుల కుల దైవాన్ని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. ఈ ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగం శ్రీశైలం ఆలయం ఉన్న అడవులలోని ఒక ఆదిమవాసి యత్రాస్థలం ఈ సలేశ్వర ఆలయం.. తర్వాత తర్వాత ఈ యాత్రకు సమీప గ్రామ ప్రజలు వెళ్లడం మొదలుపెట్టారు. అక్కడితో అగారా.. తర్వాత జిల్లాలకు.. ఇప్పుడు ఏకంగా 5 నుంచి 6 రాష్ట్ర ప్రజలు ఈ సలేశ్వర యాత్ర చేయడానికి వేయ్యి కల్లతో వేచి చూస్తు ఉంటారు. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి జాతర జరుగుతుంది. ఈ జాతర ఉగాది వెళ్ళిన తరువాత చైత్ర పౌర్ణమికి మొదలవుతుంది. అడవిలో 25 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవలసి వుంటుంది. ఇందులో 20 కిలోమీటర్ల వాహన ప్రయాణం చేసుకోవచ్చు. ఆ తర్వాత వాహనాలు నడిపేందుకు దారులు ఉండవు.. దట్టమైన అడవిలో రాళ్లు, రప్పలను సైతం లెక్క చేయకుండా దాదాపు 5 కి.మీ. మేర నడక మార్గంలో వెళ్లి శివుడిని దర్శించుకోవాలి.
సలేశ్వరం లింగ రూపంలో దర్శనం..
ఇక్కడ ఈశ్వరుడు లింగ రూపంలో కొలువుదీరి ఉన్నాడు. ఇక్కడ శివుడు ఎలాంటి సపోర్ట్ లేకుండా ఉన్న ఎత్తైన పర్వతం కిందా.. ఓ అంతు చిక్కని లోయలో పక్కన ఉన్న గుహలో సలేశ్వరుడిగా దర్శనమిస్తాడు. ఇక్కడ సంవత్సరంలో 3 రోజులు మాత్రమే ఈ అడవిలోనికి అనుమతి వుంటుంది. ఇక్కడ జలపాతానికి సందర్శకులు అందరూ ముగ్ధులు అవుతారు.
సలేశ్వరం గుండం ప్రత్యేకతలు..
సలేశ్వరం యాత్రలో అతి ముఖ్యమైన ఘట్టం సలేశ్వరం గుండం.. ఇక్కడ ఎత్తైన అంతు చిక్కని దారి నుంచి దట్టమైన అడవిలో నుంచి ఆకాశగంగ పైనుంచి పడినట్లు ఓ జలపాతం జాలువారుతుంది. ఈ జలపాతం కింద తడిసి ముద్గులు అవ్వలాని యువత తెగ సాహసాలు చేస్తుంటారు. ఆ జలపాతం నీరు మండుటెండలో కూడా చాలా చల్లగా ఉంటుంది. అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్లగా.. గుండం కొంత దూరం ఉండగానే.. లోయ అడుగు భాగానికి చేరుకుంటాం.. గుండం నుంచి పారే నీటి ప్రవాహం వెంట రెండు గుట్టల మధ్య ఇరుకైన లోయ ఉంటుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా నడవాలి. నడక మార్గం కూడా ఒక్కోచోట బెత్తెడు దారి మాత్రమే ఉంటుంది. అడుగు కూడా పట్టనంత స్థలం ను దాటుకుంటు గుండం చేరుకోవాలి. గుండం చేరిన తర్వాత అక్కడి దృశ్యం నా భూతో నా భవిశత్తు అన్నట్లుగా.. అక్కడి అందాలు మనల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. పైనుంచి జాలువారే జలపాతం అనేక వనమూలికలతో కలిసిన ఆ నీరు ఆరోగ్యానికి మంచిదని.. భక్తులు నీటిని తమ ఇంటికి తీసుకెళ్తుంటారు. ఆ జలపాతం నీరు కూడా చాలా తీయ్యగ ఉంటాయి.
భక్తుల భక్తి భావం నినాదం.. “వస్తున్నాం లింగమయ్యా” – “వెళ్లొస్తాం లింగమయ్యా”
ప్రాణాలకు తెగించి నేను వెళ్లగలను అని దైర్యం.. దైవ సంకల్పం ఉన్న వాళ్లు మాత్రమే ఈ సలేశ్వర యాత్ర చేసేందుకు ముందుకు వస్తారు. అందుకే అత్యంత సాహసోపేత యాత్రగా చెబుతారు. దర్శనానికి వెళ్లేముందు ‘వస్తున్నాం లింగమయ్యా’.. అని, తిరిగి వెళ్లే సమయంలో ‘వెళ్లొస్తాం లింగమయ్యా’.. అంటూ దారి పొడవునా నామస్మరణ మార్మోగనున్నది. ఉమ్మడి జిల్లా మహాబుబ్ నగర్ తో పాటుగా.. (వనపర్తి, గద్వాల, మహాబున్ నగర్, నాగర్ కర్నూల్) తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సా, ఛత్తీస్ గఢ్.. నుంచి వేలాదిగా భక్తులు తరలిరానున్నారు. జాతరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ యాత్ర చేసిన వారు ఇక్కడి అందాలను జీవితాంతం గుర్తుంచుకుంటారు.
దారి పొడవునా.. అద్భుత అందేలే..
నల్లమల కొండల నడుమ చల్లని కృష్ణానది పడుతుంటే.. సలేశ్వరం లింగమయ్య వద్ద ఉన్న అద్భుత జలపాతం భక్తులను.. పర్యాటకులను చూపుతిపోకోనివ్వదు. నిండు పచ్చదనం కొండలు.. కోనలు.. లోయలు.. గుహలు.. ఎటుచూసినా ప్రకృతి రమణీయతే.. ఎక్కడ చూసిన ఎతైన నల్లమల్ల కొండలే..
సలేశ్వరం యాత్ర రోడ్డు మార్గం…
హైదరాబాద్ నుండి సలేశ్వరం కి 173 కిలోమీటర్లు..
హైదరాబాద్ శ్రీశైలం హైవే పై నుంచి ఎడమ చేతి వైపు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలో నుంచి దట్టమైన అటవీ మధ్య 35 కిలో మీటర్లు వరకు అన్ని రకాల వాహనాలు ప్రయాణికి అనుకూలంగా ఉంటుంది. అక్కడి నుంచి కాలి నడకన సలేశ్వ రం బేస్‌క్యాంపు కు చేరుకోవాలి. అక్కడి నుంచి సలేశ్వరానికి భూమిలోపలికి వెళ్తున్నట్లు ఒక వైంపు లోయ మాదిరి కనిపిస్తుంది. అక్కడే సలేశ్వర యాత్రకు ముఖ మార్గం.. అక్కడి నుంచి రాళ్లు రప్పలు.. మండు ఎండలో 5 కి.మీ లోయలో కర్రలు చేత బట్టి ఒక్కొక్క రాయి అచి తుచి గమనిస్తు లోయ దిగి సలేశ్వర లింగమయ్యను చేరుకోవాలి. ఈ యాత్ర కేవలం మూడు రోజులు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఫారెస్ట్ అధికారులు అక్కడ ఉన్న యాత్రికులను తిరిగి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి బయటకు పంపిస్తారు.
ప్రత్యేక బస్సులు సర్వీసులు..
సలేశ్వరం యాత్రకు ముడు రోజులు నల్లమల్ల వైపు బస్సు ప్రయాణాలు సాగుతాయి.
నాగర్‌కర్నూల్ అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి, వనపర్తి, గద్వాల, మహబూబ్ నగర్ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు సర్వీసులు ప్రభుత్వం కల్పిస్తుంది.
కాశ్మీర్ అమర్నాథ్ కు తెలంగాణ అమర్ నాథ్ కు తేడా ఏంటి..?
- అమర్ నాథ్ లో (శివుడు) మంచు అకారంలో లింగం రూపంలో ఉంటుంది.
- అమర్నాథ్ యాత్ర పూర్తి మంచు వర్షం కారణంగా నిర్దేశిత తేదీల్లో మాత్రమే దర్శనం చేసుకోవచ్చు. ఒక సంవత్సరంలో 10 – 20 రోజులు మాత్రమే..
- అమర్నాథ్ యాత్ర చేయాలంటే 36 కిలోమీటర్లు ట్రెక్క్ చేసి మంచు లింగాన్ని దర్శించుకోవాలి.
- అమర్ నాథ్ లో శివుడు జల రూపంలో ఉంటుంది.
- అమర్నాథ్ యాత్ర యాత్రికులు వెళ్లాలంటే ఆకాశాన్ని తాకే ఎత్తైన పర్వతాలను దాటుకుంటూ వెళ్లాలి.
- అమర్ నాథ్ యాత్రలో నడవలేని యాత్రికులు జోడి లో.. పల్లకిలో.. గుర్రాల సహాయంతో భక్తులు అమర్ నాథ్ ఆలయ చేరుకుంటారు.
- అమర్నాథ్ యాత్రకు వెళ్లాలంటే ముందుగా అక్కడి ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాలి.
- అమర్నాథ్ యాత్ర చేయాలంటే అక్కడి వాతావరణ కు తట్టుకునే.. శరీరం రక్షణకు కొన్ని రకాల వస్తువులను తీసుకోవాలి.
- అమర్ నాథ్ యాత్రకు వెళ్లే ముందు మన హెల్తే డిటేల్స్ అక్కడి ఆలయ అధికారులకు ఇవాల్సి ఉంటుంది.
- అమర్నాథ్ యాత్ర ఏ క్షణం లో హిమపాతం జరగవచ్చు.. ఏ క్షణంలో యాత్రను రద్దు చేయ్యవచ్చు.
- అమర్నాథ్ యాత్ర హెలికాప్టర్ ద్వారా కూడా చెయ్యదు.
తెలంగాణ అమర్నాథ్ యాత్ర ( సలేశ్వరం యాత్ర )
- తెలంగాణ సలేశ్వర యాత్ర సంవత్సరంలో మూడు రోజులు మాత్రమే దర్శనం చేసుకోవచ్చు.
- సలేశ్వర యాత్ర చేసుకునేందుకు అమ్రాబాద్ టైగర్ ఫారెస్ట్ అధికారుల గైడ్ లైన్స్ మేరకే జరపాలి.
- సలేశ్వర లింగమయ్య కు నేటి వరకు కూడా చెంచులు మాత్రమే పూజలు నిర్వహిస్తున్నారు.
- సలేశ్వరం యాత్ర కు ఎలాంటి మంచు వర్షం గానీ.. సాధారణ వర్షం నుంచి గానీ అటంకం ఉండదు.
- సలేశ్వర యాత్ర కేవలం ఎండాకాలం అయిన ఏప్రిల్ నెలలో మాత్రమే జరుగుతుంది.
- సలేశ్వర యాత్ర ఉగాది తర్వాత చైత్ర పౌర్ణమికి ఒకరోజు ముందు, చైత్ర పౌర్ణమి రోజు.. చైత్ర పౌర్ణమి మరుసటి రోజు మాత్ర యాత్ర చేసుకునేందుకు అనుమతి ఉంటుంది.
- సంవత్సరం పొడవున యాత్ర కేవలం మూడు రోజులు మాత్రమే ఉంటుంది.
- సలేశ్వర యాత్రకు అక్కడి అధికారులకు ఎలాంటి హెల్త్ డిటేల్స్ ఇవ్వక్కర్లేదు.
- సలేశ్వర యాత్ర కు ఏ వయసు వారైననా అనుమతిస్తారు.
- సలేశ్వర యాత్ర 5 కి.మీ లోయలోకి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్లాలి.
- సలేశ్వరం యాత్ర కేవలం కాలినడక ద్వారానే దర్శించుకోవాలి.
SSM