Telangana Assembly Elections: తెలంగాణలో ఎన్నికల ప్రచారం బంద్ : అమల్లోకి 144 వ సెక్షన్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. నవంబర్ 30 న ఉదయం నుంచి 119 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తారు. డిసెంబర్ 3 నాడు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి.

A long weekend that is putting tension.. Will techies vote..
TS Assembly Elections : తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసింది. సాయంత్రం 5 గంటలకు ప్రచారం బంద్ అయింది. 13 నియోజకవర్గాల్లో ప్రత్యేక పరిస్థితులతో సాయంత్రం 4గంటలకే క్యాంపెయిన్ ఆగిపోయింది. రాష్ట్రంలో సైలెంట్ పీరియడ్ మొదలైందనీ, 144 సెక్షన్ అమల్లోకి వచ్చినట్టు సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారం చేయొద్దని కోరారు. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేయకూడదని చెప్పారు. పోలింగ్ ముగిసిన అరగంట తర్వాతే ఒపీనియన్ పోల్ ప్రసారం చేయాలని వికాస్ రాజ్ సూచించారు.
ఈ 48 గంటలు చాలా కీలకమనీ…. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామని సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. పోలింగ్ సందర్భంగా అభ్యర్థికి ఒక వాహనానికి మాత్రమే అనుమతినిచ్చారు. బుధవారం నాడు ఈవీఎం, ఎన్నికల సామగ్రి పంపిణీ ఉంటుంది. ఈవీఎంల పంపిణీ, రవాణాకు సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే అభ్యర్థులు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కు వెళ్లొచ్చని సీఈవో సూచించారు.
ఈనెల 30వ తేదీ తెల్లవారుజామున 5.30 గంటలకు మాక్ పోలింగ్ ఉంటుంది. హోమ్ ఓటింగ్ లో 27 వేల 178 మంది ఓట్లు వేశారు. వీళ్ళల్లో సీనియర్ సిటీజన్లు 15 వేల 999 మంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుంటున్నారని వికాస్ రాజ్ చెప్పారు. 7వేల 571 పోలింగ్ స్టేషన్లలో ఎక్కువ మంది ఓటర్లు ఓట్లు వేస్తారని తెలిపారు. స్థానికేతరులు ఎవరూ నియోజకవర్గాల్లో ఉండకూడదని అన్నారు. హైదరాబాద్ లో ఈ రెండు రోజులు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.